Homeఅంతర్జాతీయంFire : కెనడాలో అగ్గి.. అమెరికాకు ముప్పు

Fire : కెనడాలో అగ్గి.. అమెరికాకు ముప్పు

Fireflies : అది మామూలు దావానలం కాదు.. కనీవినీ ఎరుగని స్థాయిలో వ్యాపిస్తున్న దావానలం. చెట్లు కాలిపోతున్నాయి. గృహాలు మంటల ధాటికి మాడిపోతున్నాయి. మనుషులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక దళాలు శక్తికి మించి ప్రయత్నం చేస్తున్నాయి. అయినప్పటికీ అక్కడ మంటలు తగ్గడం లేదు. ఇది ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా లో నెలకొన్న పరిస్థితి. ఇంతకీ అక్కడ ఏం జరిగింది అంటే..

అమెరికాలోని వాషింగ్టన్‌ రాష్ట్రానికి కార్చిచ్చు ముప్పు పొంచి ఉంది. కెనడాలో గత నెల ఓ పిడుగుపాటుతో ప్రారంభమైన దావానలం.. ఆ దేశంలోని పలు నగరాలను తుడిచిపెట్టేసింది. యెల్లోనైఫ్‌ నగరంలో ఇళ్లు దహనమై.. ఘోస్ట్‌సిటీగా మారింది. బ్రిటిష్‌ కొలంబియా ప్రావిన్స్‌లో ఎమర్జెన్సీ విధించారు. హవాయి దీవిలో బీభత్సం సృష్టించిన ఈ కార్చిచ్చుకు బలమైన గాలులు తోడవ్వడంతో.. అమెరికావైపు దూసుకుపోతూ వాషింగ్టన్‌ రాష్ట్రానికి ముప్పుగా పరిణమించింది. దీంతో ఉత్తర అమెరికా దేశాలు బిక్కుబిక్కుమంటున్నాయి. మరోవైపు మెక్సికోలో హిల్లరీ హ్యారికేన్‌ బీభత్సం సృష్టిస్తోంది.

గంటల వ్యవధిలో..

కెనడా మీదుగా వాషింగ్టన్‌లోని స్పోకాన్‌ కౌంటీ వద్ద మొదలైన కార్చిచ్చు.. కొన్ని గంటల వ్యవధిలోనే 3,600 ఎకరాలకు విస్తరించింది. బలమైన గాలులు తోడవ్వడంతో దావానలం వేగంగా వ్యాప్తి చెందుతోందని వాషింగ్టన్‌ రాష్ట్ర సహజ వనరుల విభాగం వెల్లడించింది. ‘‘ఇప్పటికే ఆగ్నేయ వాషింగ్టన్‌లో కొన్ని ఇళ్లు కాలిపోయాయి. ఆస్తినష్టం సంభవించింది. స్పోకాన్‌ కౌంటీలోని మెడికల్‌ లేక్‌ పట్టణ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం. ఫోర్‌లేక్స్‌ పట్టణానికి కూడా మూడో హెచ్చరిక జారీ అయ్యింది. అక్కడి పౌరులను తరలిస్తున్నాం’’ అని ఆ విభాగం అధికార ప్రతినిధి జో స్మైలీ చెబుతున్నారు. అగ్నికీలలు వాషింగ్టన్‌లో విస్తరించకుండా అగ్నిమాపకశాఖ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మెడికల్‌ లేక్‌లో పౌరులందరినీ తరలించామని ఆ పట్టణ మేయర్‌ టెరీ కూపర్‌ ఫేస్‌బుక్‌లో ప్రకటించారు. మరోవైపు కార్చిచ్చు భయంతో ఉత్తర అమెరికా దేశాలు బిక్కుబిక్కుమంటున్నాయి.

కెనడాలో బీభత్సం

కెనడాలో కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. వాయవ్య కెనెడా రాజధాని యెల్లోనైఫ్ లో 19వేల మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాలి బూడిదైపోయిన ఇళ్లు, వాహనాలు, నిర్జన ప్రదేశాలతో ఇప్పుడు ఆ నగరం ఘోస్ట్‌సిటీగా మారిపోయిందని అక్కడి అధికారులు వాపోయారు. 15 వేల మంది పౌరులు రోడ్డు మార్గంలో, 3,800 మంది ఎమర్జెన్సీ విమానాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లినట్లు తెలిపారు. లక్షన్నర జనాభా ఉన్న కెలోవ్నా నగరానికి కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశించారు. బ్రిటిష్‌ కొలంబియాలో జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించినట్లు తెలిపారు.

-మెక్సికోకు హ్యారికేన్‌ ముప్పు
మెక్సికోకు హిల్లరీ హ్యారికేన్‌ ముప్పు పొంచి ఉంది. బాజా కాలిఫోర్నియా వైపు హ్యారికేన్‌ దూసుకెళ్తోందని అమెరికా జాతీయ హ్యారికేన్‌ కేంద్రం వెల్లడించింది. శనివారం అర్ధరాత్రికల్లా ఈ రాకాసి సుడిగాలి మెక్సికోను తాకనున్నట్లు వివరించింది. అయితే.. ఇక్కడ గాలుల వేగం గంటకు 230 కిలోమీటర్ల నుంచి 215 కిలోమీటర్లకు తగ్గిపోయాయని, వేగం కూడా గంటకు 20 కిలోమీటర్ల మేర ఉందని పేర్కొంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper