Donald Trump: అమెరికాలో మరికొద్ది నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష బరిలో ఉన్నప్పుడు ట్రంప్, బైడన్ మధ్య పోటీ హోరాహోరీగా ఉండదని, ట్రంప్ గెలుస్తాడని అంచనాలు వెలుపడ్డాయి. ఆ తర్వాత ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. దీంతో ఆయనకు ఒకసారిగా సానుభూతి పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మద్దతు లభించింది.. దీంతో ఇక ట్రంప్ అధ్యక్షుడవుతాడని, ఆయనకు ఎదురులేదని అందరూ భావించారు. ట్రంప్ కూడా విజయంపై ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు. కానీ ఇక్కడే రిపబ్లికన్ పార్టీ సరికొత్త ఎత్తుగడ ప్రదర్శించింది. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.
అతడు వైదొలిగిన తర్వాత..
అధ్యక్ష పదవికి సంబంధించి రిపబ్లికన్ పార్టీ తరఫునుంచి జో బైడన్ రంగంలో ఉన్నారు. కానీ హఠాత్తుగా ఆయనను పక్కనపెట్టి.. ఉపాధ్యక్షురాలు కమలహారిస్ ను రిపబ్లికన్ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఆయనప్పటికీ ట్రంప్ గెలుస్తారని అందరూ భావించారు. కానీ చాప కింద నీరు లాగా కమల తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో తమ ప్రభుత్వ హయాంలో చేసిన పనులను ప్రచారం చేసుకున్నారు. ట్రంప్ తీసుకుని నిర్ణయాలు, అవి అమెరికాపై చూపించిన ప్రభావాన్ని అర్థమయ్యేలా ఆమె చెప్పగలిగారు. దీంతో ఒకసారిగా పరిస్థితి మారిపోయింది. ఫలితంగా ఒపీనియన్ పోల్స్ లో కమల కంటే ట్రంప్ నాలుగు పాయింట్లు వెనుకబడి పోయారు. అమెరికా ఎన్నికల్లో అత్యంత కీలకమైన విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిచిగాన్ రాష్ట్రాలలో కమల ట్రంప్ పై ఆధిక్యం ప్రదర్శించారు.
ఉపాధ్యక్ష అభ్యర్థి అతడే
మిన్నేసోట గవర్నర్ టీం వాల్జ్ ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమల ప్రకటించారు. కమల ను అధ్యక్ష పదవికి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ట్రంప్ గ్రాఫ్ పడిపోతున్నట్టు అమెరికా మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు కమల అధ్యక్షురాలు అయితే తమకు భరోసా ఉంటుందని, భవిష్యత్తుపై నమ్మకం ఉంటుందని చాలా మంది ఓటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కమల కూడా తనదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇదే హవా కనుక ఆమె కొనసాగిస్తే ఎన్నికల జరిగే నవంబర్ నాటికి కమల పూర్తి పట్టు సాధించి.. అధ్యక్షురాలయ్యే అవకాశం లేకపోలేదని అమెరికన్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ట్రంప్ తనపై జరిగిన హత్యాయత్నాన్ని పదేపదే ప్రస్తావిస్తుండడంతో జనాలకు విసుగు పుట్టిందని.. అసలు జరిగిన సంఘటన కంటే ట్రంప్ చెప్పిందే అతిలాగా ఉందని ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కమల అధ్యక్ష ఎన్నికల బరిలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా అమెరికాలో పరిస్థితి మారిపోయింది.
ట్రంప్ ఏం చేస్తాడో
కమల దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. హత్యాయత్నం ఘటన అతడిపై సానుభూతిని పెంచగా.. దానిని అతడు అత్యంత సమర్థవంతంగా వాడుకున్నాడు. కానీ ఈ లోగానే కమల ను అధ్యక్ష అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ ప్రకటించడంతో పరిస్థితి మారిపోయింది. ట్రంప్ గ్రాఫ్ పడిపోయింది. ఈ తరుణంలో ట్రంప్ వేసే అడుగుల ను అందరూ అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎలాంటి అద్భుతమైనా చేస్తాడని డెమొక్రటిక్ పార్టీ నాయకులు ఆశాభావంతో ఉన్నారు.