https://oktelugu.com/

Cars: బడ్జెట్ లో వచ్చే 8 సీటర్ కార్లు ఇవే.. ధర ఎంతో తెలుసా?

ఈమధ్య 8 సీటర్ కార్ల గురించి జోరుగా చర్చ సాగుతోంది. ఎక్కుడ సీట్లు ఉన్న కార్ల వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఇవి ఉండడం ద్వారా కార్యాలయ అవసరాలతో పాటు లాంగ్ ట్రిప్ వేయడానికి సౌకర్యంగా ఉంటుంది. అలాగే జర్నీలు ఎక్కువగా చేసేవారు ఈ కారునే ఇష్టపడుతూ ఉంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 12, 2024 / 03:17 PM IST

    8 Seater Cars in India

    Follow us on

    Cars: కారు కొనాలనుకునేవారు భిన్నమైన ఆలోచనలో ఉంటారు. కొందరు సింపుల్ గా ఫ్యామిలీ అవసరాల కోసం వెహికల్ ను కొనుగోలు చేస్తారు. మరికొందరు విశాలమైన స్పేస్ ఉండే ఎస్ యూవీ వేరియంట్లను కోరుకుంటారు. ఇంకొందరు ఖరీదైన కార్ల కోసం ఎదురుచూస్తారు. అయితే ఫ్యామిలీ అవసరాలతో పాటు దూర ప్రయాణాలు చేసేందుకు ఎక్కువ సీట్లతో ఉండే కారుపై మోజు పెంచుకునేవారు మరి కొందరు ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా 7 టు 8 సీటర్ కార్లనే ఎక్కువగా ఉత్పత్తిపై ఫోకస్ పెడుతూ ఉంటాయి. ఈమధ్య 8 సీటర్ కార్ల గురించి జోరుగా చర్చ సాగుతోంది. ఎక్కుడ సీట్లు ఉన్న కార్ల వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఇవి ఉండడం ద్వారా కార్యాలయ అవసరాలతో పాటు లాంగ్ ట్రిప్ వేయడానికి సౌకర్యంగా ఉంటుంది. అలాగే జర్నీలు ఎక్కువగా చేసేవారు ఈ కారునే ఇష్టపడుతూ ఉంటారు. 8 సీటర్ కారు అనగానే ధర ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. కానీ కంపెనీలు బడ్జెట్ లో 8 సీటర్ కార్ల అందిస్తున్నాయి. ఆ కార్లు ఏవో చూద్దాం..

    ఎస్ యూవీ కార్లను మార్కెట్లోకి తీసుకురావడంలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ముందు ఉంటుంది. ఈ కంపెనీ నుంచి 8 సీటర్ కారు కూడా అందుబాటులోకి వచ్చింది. మహీంద్రా మరాజో అనే 8 సీటర్ కారు ఆకట్టుకుంటోంది. విశాలమైన స్పేస్ తో పాటు సౌకర్యవంతమైన సీట్లు ఇందులో ఉన్నాయి. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ కారు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో పనిచేస్తుంది. దీనిని రూ.14.04 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

    దేశంలో కార్ల ఉత్పత్తిలో ఉన్న ప్రముఖ కంపెనీల్లో టాటా ఒకటి. ఈ కంపెనీ నుంచి ఇన్నోవా క్రిస్టా 8 సీటర్ తో సౌకర్యవంతంగా ఉంటుంది. 2393 సీసీ డీజిల్ ఇంజిన్ తో పనిచేసే ఈ కారు 147 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తూ.. 343 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని రూ. 19 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇది టాటా ఇన్నోవాకు కొనసాగింపుగా మార్కెట్లో అందుబాటులో ఉంది.

    దక్షిణ కొరియా కంపెనీకి చెందిన కియా కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఈ కంపెనీకి చెందిన కార్నివాల్ 8 సీటర్ కారు శక్తివంతమైన ఇంజిన్ అందిస్తుంది. అలాగే విలాసవంతమైన స్పేస్ ను కలిగి ఉంది. ఈ కారు ద్వారా ప్రీమియం అనుభవం పొందుతారు. దీనిని రూ. 40 లక్షలతో విక్రయిస్తున్నారు. టాటా కంపెనీకి చెందిన మరో కారు సఫారీ 8 సీటర్ కారు అందుబాటులో ఉంది. ఇందులో మూడు వరుసల్లో మొత్తం 8 సీట్లు సౌకర్యవంతంగా ఉంటాయి.

    ఎంజీ కంపెనీకి చెందిన ‘హెక్టర్ ప్లస్’ 8 సీటర్ వేరియంట్ లో మిగతా కార్లకు పోటీ ఇస్తుంది. ఇది స్టైలిష్ డిజైన్ తో కూడుకొని ఉంది డిజిటల్ టెక్నాలజీతో ఉన్న డ్యాష్ బోర్డును కలిగి ఉన్న దీని ఫీచర్స్ ఆకట్టుకుంటున్నాయి.