ABN Radhakrishna: మీడియా అనేది ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అంటారు. కానీ నాలుగో స్తంభం.. ఇప్పుడు పార్టీల పెండాలు మోస్తున్నాయి. ఏ పార్టీలు ప్యాకేజీలు, ప్రకటనలు ఇస్తే.. ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాయి. అక్రమాలను, అవినీతిని దాచిపెడుతున్నాయి. ఛానెళ్ల తీరుతోనే ఇప్పుడు సోషల్ మీడియా బలంగా మారింది. ఏపీలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, ఈటీవీ, ఏబీఎన్, టీవీ5తోపాటు మరికొన్ని పత్రికలు, ఛానెళ్లు టీడీపీ పక్షమే. అధికారంలో ఉన్నా.. లేకపోయినా టీడీపీ తరఫునే ప్రచారం చేస్తాయి. ఆ పార్టీ అనుకూల వర్తాలనే ప్రచురిస్తాయి. ప్రసారం చేస్తాయి. అయితే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ తాజాగా తన టీవీ ఛానెల్‌లో అధికార టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అక్రమాల గుట్టు రట్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ నేతలు, తొలిసారి అధికారం చేపట్టిన జనసేన నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుఅని అమ్రాలకు పాల్పడుతున్నారట. అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారట. వనరులను కొల్లగొడుతున్నారని వివరించింది. ఈ వీడియోలో కొందరి పేర్లను కూడా బయటపెట్టారు రాధాకృష్ణ. కొంతమంది అక్రమాలను పేర్లు చెప్పకుండా దాచారు. సీఎం చంద్రబాబును అప్రమత్తం చేయాలన్న ఉద్దేశంతో ఈ వార్త ప్రసారం చేసినుట్లు ఉంది. కానీ, అది జనంలోని మరో విధంగా వెళ్తోంది. అధికారం అడ్డం పెట్టుకుని కూటమి నేతలు ఇంత దారుణానికి పాల్పడుతున్నారా అన్న చర్చ ఏపీలో జరుగుతోంది. ఇక వైసీపీ నేతలు ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
టీడీపీ, జనసేన నేతలే లక్ష్యంగా..
ఏబీఎన్ రాధాకృష్ణ తాజాగా తన ఛానెల్‌లో అధికార టీడీపీ, జనసేన పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులే లక్ష్యంగా అక్రమాలను బయటపెట్టారు.
– నర్సారావుపేట నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతలు నాలుగు బార్ల యజమానులను బెదిరిస్తున్నారనని, బార్లను తమకు అప్పగించాలని ఒత్తిడి చేస్తున్నారని రాధాకృష్ణ తన వార్తలో ప్రసారం చేశారు.
– ఇక అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే అనుచరులు ఓ ఫార్మా కంపెనీని తమకు కప్ప కట్టాలని ఆదేశిస్తున్నారట.
– రాయలసీమలోని కడప జిల్లాలో అధికార పార్టీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారట. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షిచే పనిలో సీఎం చంద్రబాబునాయుడు ఉండగా, కూటమి నేతలు మాత్రం అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
– సానా సతీశ్ తూర్పుగోదావరి జిల్లాలో ఏళ్లుగా గ్రానైట్ వ్యాపారం చేసుకుంటున్న వారిని తరిమి కొట్టారు. వాటిని సతీశ్ చెరబట్టారు.
– నెల్లూరు జిల్లాలో ప్రైవేటు భూముల్లో సిలికా లభిస్తుంది. భూముల యజమానులు వాటిని లీజ్‌కు ఇచ్చి ఆదాయం పొందేవారు. కానీ ఇప్పుడు అధికార కూటమి నేతలు సిలికా వ్యాపారులను తరిమేసి వాటిని కబ్జా చేశారట. చీమకుర్తిలోని గెలాక్సీ గ్రానైట్ గనులను కూడా ఆక్రమించుకున్నారు.
– ఉచిత ఇసుక మాటున అధికార పార్టీ నేతలు ప్రకృతి సంపదను దోచుకుంటున్నారు. లారీల కొద్ది తరలించుకుపోతున్నారు.
పెట్టుబడులను ఆహ్వానించాలి..
ఏపీ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ క్రమంలోరాష్ట్రంలో వ్యాపారుల పెట్టుబడులను ఆహ్వానించాల్సింది పోయి అధికార పార్టీ నేతలు పెట్టుబడిదారులు పారిపోకేలా వ్యవహరిస్తున్నారన్నది రాధాకృష్ణ ఉద్దేశం. దీనిపై చంద్రబాబు నాయుడు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. పెట్టుబడిదారులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని సూచించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఏబీఎన్‌లో అధికార పార్టీ నేతల అక్రమాలు ప్రసారం కావడమే ఇప్పుడు టీడీపీ, జనసేన నేతలకు మింగుడు పడడం లేదు. తమ అనుకూల మీడియా తమను బజారుకు ఈడ్చడంపై మండిపడుతున్నారు. మరి ఈ పరిణామం ఎటు దారితీస్తుందో చూడాలి.
రాష్ట్రాన్ని అమ్మబోతులలా దోచుకుంటున్న టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు..
– ABN ఆంధ్రజ్యోతి#SaveAPFromTDP #AndhraPradesh pic.twitter.com/BPmiVByJca
— Team Jagan Army | Siddham (@nenurajun) August 11, 2024