900 earthquakes in two weeks: జపాన్ అనగానే మనకు గుర్తుకువచ్చేది టెక్నాలజీ. ఈ దేశంలో సాంకేతిక పరిజ్ఞానం చాలా ఎక్కువ. ఇక్కడ అందరూ పనిచేస్తారు. ఇక ఇదే దేశంలో యువ జనాభా తగ్గిపోతోంది. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. చిన్న దేశమైన జపాన్‌లో ప్రకృతి వైపరీత్యాలు కూడా ఎక్కువే. అగ్నిపర్వతాల పేలుళ్లు, భూకంపాలు ఇక్కడ ఎక్కువ. స్థానికంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా తరచూ ఇక్కడ భూకంపాలు సంభవిస్తాయి. అందుకే ఇక్కడ ఇళ్ల నిర్మాణశైలి కూడా భిన్నంగా ఉంటుంది. తాజాగా రెండు వారాల్లో 900సార్లు భూమి కంపించడమే ఇందుకు నిదర్శనం. జపాన్‌లో తరచూ సంభవించే భూకంపాలకు ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అనే భౌగోళిక ప్రాంతం కీలక కారణం.
భూమిలో అంతర్గత కదలికలు
భూమి పైపొరలో 16 ప్రధాన ఫలకాలు ఉన్నాయి, ఇవి నిరంతరం కదలికలో ఉంటాయి. ఈ ఫలకాలు ఒకదానికొకటి రాసుకుంటూ, దూరంగా జరుగుతూ లేదా ఒకదానిపై ఒకటి ఒరుగుతూ ఉంటాయి. ఈ కదలికలు భారీ శక్తిని విడుదల చేస్తాయి, ఫలితంగా భూకంపాలు సంభవిస్తాయి. ఈ కదలికలు ఎక్కువగా భూమి పైపొరల్లో జరుగుతాయి, ఎందుకంటే లోతైన పొరల్లో రాళ్లు ద్రవ రూపంలో ఉంటాయి, ఇవి భూకంపాలకు అనువుగా ఉండవు. భూకంపాలు ఎక్కువగా ఫలకాల అంచుల వద్ద సంభవిస్తాయి, ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ఒత్తిడి, రాపిడి ఎక్కువగా ఉంటాయి.
Also Read: అమెరికాలో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు ఆమోదం.. అసలేంటి బిల్.. దీంతో ఏం జరుగనుంది?
భూకంపాల కేంద్రం..
పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రపంచంలో 80% భూకంపాలకు కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలో పసిఫిక్ ఫలకం ఇతర ఫలకాలతో రాపిడి, ఒకదానిపై ఒకటి ఒరుగుతూ లేదా పక్కపక్కనే రాసుకుంటూ ఉంటుంది. జపాన్ ఈ రింగ్‌లో కీలక స్థానంలో ఉంది, ఇక్కడ పసిఫిక్, యురేసియన్ ఫలకాలు కలుస్తాయి. జపాన్ ఈ ప్రాంతంలో ఉండే దేశాలలో ఒకటి, అందుకే ఇక్కడ భూకంపాలు తరచూ సంభవిస్తాయి. 2011లో టోహోకు భూకంపం (9.1 తీవ్రత) ఈ ప్రాంతంలోని శక్తివంతమైన ఫలక కదలికలను స్పష్టంగా చూపించింది.
భూకంపాల తీవ్రత ఇలా..
ఫలకాలు కలిసే స్థానాలను ‘ఫాల్ట్ లైన్లు’ అంటారు. ఇవి మూడు రకాలుగా విభజించబడతాయి. మొదటిది రెండు ఫలకాలు అడ్డంగా రాసుకుంటూ కదిలే స్థానాలు. వీటిని స్ట్రైక్–స్లిప్ ఫాల్ట్స్ అంటారు. టర్కీలోని తూర్పు అనటోలియన్ ఫాల్ట్, అమెరికాలోని శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్‌లో ఈ ఫాల్ఠ్ లైన్ల కారణంగా భూకంపాలు వస్తాయి. ఇక రెండోది నార్మల్ ఫాల్ట్స్. ఫలకాలు ఒకదాని నుంచి మరొకటి దూరంగా జరిగి, ఒక ఫలకం కిందకు జారిపోయినప్పుడు ఏర్పడతాయి. ఇథియోపియాలోని అఫార్ ట్రిపుల్ జంక్షన్, మిడ్–అట్లాంటిక్ రిడ్జ్ ఈ భూకంపాలు ఎక్కువ. మూడోరి రివర్స్ లేదా థ్రెస్ట్ ఫాల్ట్స్. రెండు ఫలకాలు ఒకదానికొకటి దగ్గరగా వచ్చి, ఒక ఫలకం మరొక ఫలకం మీదకు ఎక్కినప్పుడు ఏర్పడతాయి. జపాన్ ట్రెంచ్, పెరూ–చిలీ ట్రెంచ్ ఇటువంటి భూకంపాలు ఎక్కువ.
తాజాగా వందలాది ప్రకంపనలు..
తాజాగా జపాన్‌లోని టొకార దీవుల్లో భూకంప కదలికలు చురుగ్గా ఉన్నాయి. రెండు వారాల్లో 900 భూకంపాలు నమోదయ్యాయి, ఒక్క రోజులో (జూన్ 23) 183 సార్లు భూమి కంపించింది. ఈ దీవుల్లో జనావాసాలు తక్కువగా ఉండటం వల్ల నష్టం పరిమితంగా ఉంది, కానీ ప్రజలు నిరంతర ఆందోళనలో ఉన్నారు. ఈ దీవులు ఫలకాల సంగమ స్థానంలో ఉండటం వల్ల భూకంపాలు తరచూ సంభవిస్తాయి.