Megaquake in Japan soon: అప్పట్లో యుగాంతం వస్తుందని తెగ ప్రచారం జరిగింది. చాలామంది దానిని నమ్మారు కూడా. కొందరైతే ఎలాగూ యుగాంతం వస్తుందనే నమ్మకంతో ఆస్తులను అమ్ముకున్నారు. జీవితాన్ని ఎలాగైనా ఉన్నన్ని రోజులు ఆస్వాదించాలని.. విహార యాత్రలకు వెళ్లారు.. నచ్చిన ఆహారం తిన్నారు. మెచ్చిన విధంగా ఉన్నారు. కానీ ప్రచారం జరిగినట్టుగా యుగాంతం చోటు చేసుకోలేదు. పైగా యుగాంతం పేరుతో హాలీవుడ్లో ఒక సినిమా రూపొందింది.. ప్రళయం నేపథ్యంలో తీసిన ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన వసూళ్లు సాధించింది. యుగాంతం అనేది చోటు చేసుకోకపోవడంతో ఆ తర్వాత.. ప్రపంచానికి సంబంధించిన ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు మరొక వదంతి వ్యాప్తిలో ఉంది. అయితే దానిని జనం కూడా విపరీతంగా నమ్ముతుండడం విశేషం.
Also Read: షికాగోలోని నైట్ క్లబ్ లో కాల్పులు నలుగురి మృతి
భూకంపాలు మాత్రమే కాకుండా సునామీలు కూడా ఎక్కువగా చోటు చేసుకునే దేశం ఈ భూమ్మీద ఏదైనా ఉందంటే అది జపాన్ మాత్రమే. జపాన్ లో ఏదో ఒక ప్రకృతి విపత్తు అనేది చోటు చేసుకుంటూనే ఉంటుంది. అందువల్లే అక్కడ గృహ నిర్మాణాలు విచిత్రంగా ఉంటాయి. భూకంపాన్ని తట్టుకునే విధంగా ఉంటాయి. జపాన్ దేశస్తులు భూకంపాన్ని మాత్రమే కాకుండా సునామీ లాంటి విపత్తును కూడా ఎదుర్కొన్నారు. అయితే ఈనెల 5వ తేదీన జపాన్ దేశంలో భారీ సునామీ ఏర్పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే సునామీ ఏర్పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించలేదు. ఉపగ్రహ ఛాయా చిత్రాలు వెల్లడించలేదు. ఈ విషయాన్ని బయట పెట్టింది జపనీస్ మంగా. జపనీస్ మంగా అనేది కామిక్ ఇమేజెస్ పుస్తకం. జపాన్ దేశానికి చెందిన ఆర్టిస్ట్ ర్యో ట ట్సుకి జపనీస్ మంగ పుస్తకంలో ముందుగానే ఒక అంచనాను వెల్లడించారు. ఆ అంచనా ప్రకారం జూలై 5న సునామీ వస్తుందని చిత్రాలు గీశారు. తన కలలోకి వచ్చే ఘటనల ఆధారంగా జపనీస్ మంగాలో కళాకృతులు గీశారు. ఈ నేపథ్యంలో చాలామంది ఫ్లైట్, హోటల్ బుకింగ్స్ రద్దు చేసుకున్నారు.
Also Read: ఇప్పటికీ అదే క్రేజ్.. వంగవీటి మోహన్ రంగా స్పెషల్ అదే!
ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా తన కలలోకి వచ్చే ఘటన ఆధారంగా జపనీస్ మంగాలో ట ట్సుకి కళాకృతులు గీశారు. 1999లో “ది ఫ్యూచర్ ఐ సా” నా పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకం మొదట్లో అంతగా పాపులర్ కాలేదు. ఈ పుస్తకంలో వాస్తవ సంఘటనలతో పాటు.. 2011లో చోటు చేసుకున్న సునామీ గురించి కూడా ప్రస్తావించారు. దీంతో అక్కడి ప్రజలు జపనీస్ మంగా ను నమ్మడం మొదలుపెట్టారు. ఇక అప్పటినుంచి ఈ పుస్తకం అక్కడ విపరీతమైన పాపులర్. లక్షల్లో కాపీల అమ్మకాలను సొంతం చేసుకుంది. ఇప్పుడు కూడా ఈ పుస్తకాన్ని అక్కడి ప్రజలు విపరీతంగా నమ్ముతున్నారు. జూలై 5న సునామి ఏర్పడుతుందని భావిస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. “ఆ పుస్తకంలో ఉన్న వివరాల ఆధారంగా చాలామంది సునామీ వస్తుందని భయపడుతున్నారు. అందువల్లే ఫ్లైట్ టికెట్లు క్యాన్సల్ చేసుకున్నారు. హోటల్ బుకింగ్స్ కూడా రద్దు చేసుకున్నారు. కేవలం తమ గృహాలకు మాత్రమే పరిమితమయ్యారు. దీని ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుందో తెలియడం లేదు. కాకపోతే ఇలాంటి పుస్తకాలలో ఉన్నవన్నీ నిజాలు అని ప్రజలు భ్రమ పడితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని” జపాన్ శాస్త్రవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.