Homeఅంతర్జాతీయంIndia EU Trade Deal: భారత్‌–ఈయూ వాణిజ్య ఒప్పందం.. పాకిస్తాన్‌ చావుకొచ్చింది!

India EU Trade Deal: భారత్‌–ఈయూ వాణిజ్య ఒప్పందం.. పాకిస్తాన్‌ చావుకొచ్చింది!

India EU Trade Deal: అగ్రరాజ్యం అమెరికాకు రెండోసారి అధ్యక్షుడు అయిన డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌కన్నా పాకిస్తాన్‌తో సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో పాకిస్తాన్‌ అమెరికా అండతో దూకుడుగా వ్యవహిస్తూవచ్చింది. ఇక భారత్‌పై ట్రప్‌ టారిఫ్‌లు విధిస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. దీంతో భారత టెక్సటైల్స్, అపరల్స్, ఫార్మా కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ 18 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈయూ వాణిజ్య ఒప్పందంలో కదలిక తెచ్చారు. ఇటీవలో స్వేచ్ఛా […]

India EU Trade Deal: అగ్రరాజ్యం అమెరికాకు రెండోసారి అధ్యక్షుడు అయిన డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌కన్నా పాకిస్తాన్‌తో సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో పాకిస్తాన్‌ అమెరికా అండతో దూకుడుగా వ్యవహిస్తూవచ్చింది. ఇక భారత్‌పై ట్రప్‌ టారిఫ్‌లు విధిస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. దీంతో భారత టెక్సటైల్స్, అపరల్స్, ఫార్మా కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ 18 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈయూ వాణిజ్య ఒప్పందంలో కదలిక తెచ్చారు. ఇటీవలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగింది. అమెరికాతో దోస్తీ పాకిస్తాన్‌కు లాభం తెచ్చిందో లేదో కానీ, భారత్‌–ఈయూ ఒప్పందం మాత్రం చావుదెబ్బకొట్టింది.

పాక్‌ ఎగుమతులకు ఆఘాతం
భారత్‌–ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పాకిస్తాన్‌కు తీవ్ర నష్టం కలిగిస్తోంది. అమెరికా టారిఫ్‌ల నుంచి తప్పించుకుని భారత టెక్స్‌టైల్స్, జెమ్స్‌ పరిశ్రమలు యూరప్‌ మార్కెట్‌లో ప్రవేశపెట్టుకుంటున్నాయి. పాక్‌ నుంచి యూరప్‌కు సంవత్సరానికి 9 బిలియన్‌ డాలర్ల ఎగుమతుల్లో టెక్స్‌టైల్స్, అపారెల్‌లు ప్రధానం. పన్ను రహిత భారత ఎగుమతులు పోటీని పెంచుతాయి.

ఉపాధి సంక్షోభం
పాక్‌ ఎగుమతుల్లో 66% పన్ను రహితం, సంవత్సరానికి 7 బిలియన్‌ డాలర్ల టెక్స్‌టైల్స్‌ ఎగుమతులే. భారత్‌–ఈయూ ఒప్పందంతో ఇవి సగానికి పడిపోవచ్చు. కోటి మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. పాకిస్తాన్‌ కామర్స్‌ మంత్రి, టెక్స్‌టైల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు భారత డీల్‌ పాకిస్తాన్‌కు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు.

అమెరికా మార్కెట్‌ నష్టాన్ని భారతం యూరప్‌తో భర్తీ చేసుకుంది, ఇక పాకిస్తాన్‌ యూరప్‌ ఎగుమతుల కోసం భారత ఎగుమతులతో పోటీ పడాల్సిన పరిస్థితి. ట్రంప్‌ సంబంధాలు ఆర్థిక లాభాలు ఇవ్వకపోగా, భారత వాణిజ్య వ్యూహం పాక్‌ వస్త్ర పరిశ్రమను చావుదెబ్బ కొట్టింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper