Homeబిజినెస్Oneplus New Model: ప్రొఫెషనల్ మొబైల్ యూజర్స్ కు ఈ ఫోన్ బెస్ట్ ఎంపిక..

Oneplus New Model: ప్రొఫెషనల్ మొబైల్ యూజర్స్ కు ఈ ఫోన్ బెస్ట్ ఎంపిక..

Oneplus New Model: Oneplus మొబైల్స్ మార్కెట్లో ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి వచ్చిన ఎన్నో ఫోన్లు వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే 2026 సంవత్సరంలో ఫ్లాగ్ ఫిష్ మోడల్ లో రిలీజ్ చేయడానికి ఈ కంపెనీ సిద్ధమవుతుంది.. ఇందులో డిస్ప్లే తో పాటు, బ్యాటరీ పనితీరు కూడా మెరుగ్గా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఇప్పటికే 2025 సంవత్సరంలో అక్టోబర్లో ఈ ఫోన్ రావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలవల్ల 2026 సంవత్సరంలో దీనిని మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతలో ఈ మొబైల్ గురించి ఆన్లైన్లో సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. దీని ప్రకారం ఈ ఫోన్ ఎలా ఉందంటే?

Oneplus నుంచి లేటెస్ట్ గా రాబోతున్న మొబైల్ 14 G. ఈ మొబైల్ లో ఉండే డిస్ప్లే ఆకర్షనీయంగా ఉండనుంది. ఇందులో 6.82 అంగుళాల LTPO AMOLED Display ఉండనుంది. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. దీంతో గేమింగ్ కోరుకునే వారితోపాటు.. నెట్ఫ్లిక్స్ వంటి మూవీస్ చూసేవారికి అద్భుతమైన అనుభూతిని కలుగుతుంది. అలాగే బ్రైట్నెస్ ఎక్కువగా ఉండి కళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ మొబైల్ లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 4 ప్రాసెసర్ ను కలిగే ఉంది. దీంతో మొబైల్ ను వేగంగా వాడినా కూడా ఇలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అలాగే ఇందులో 12gb రామ్ తో పాటు 256 జీబీ స్టోరేజ్ ఉండడంతో కావాల్సిన ఫోటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్ స్టోర్ చేసుకోవచ్చు.

ఈ మొబైల్లో ప్రధానంగా కెమెరా గురించి చెప్పుకోవచ్చు. ఇందులో 50MP. మెయిన్ కెమెరా ఉండనుంది. అలాగే 50 MP పెరిస్కోప్ టెలి+కెమెరా కూడా పనిచేస్తుంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 50 MP కెమెరా పనిచేయనుంది. అద్భుతమైన ఫోటోగ్రఫీ కోసం.. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వారి కోసం ఈ కెమెరా ఫుల్ సపోర్ట్ ఇవ్వనుంది. అలాగే సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఈ మొబైల్లో బ్యాటరీ వ్యవస్థా మెరుగ్గా ఉంది ఇందులో 6500 mAh బ్యాటరీ ఉండగా.. ఇది ఫాస్టెస్ట్ చార్జింగ్తో పనిచేస్తుంది. రోజువారి వినియోగంతో పాటు ప్రొఫెషనల్ గా మొబైల్ యూస్ చేసే వారికి ఈ బ్యాటరీ ఎక్కువసేపు చార్జింగ్ ఉండనుంది. అలాగే తొందరగా చార్జింగ్ కావాలని అనుకునే వారికి కూడా సపోర్ట్ ఇవ్వని ఉంది. ఇది మార్కెట్లోకి వస్తే రూ.69,900 ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉంది. కొత్తగా మొబైల్ కొనుగోలు చేసే వారితోపాటు ఇప్పటికే ఉన్న మొబైల్స్ స్థానంలో ఎక్స్చేంజ్ చేసుకునే వారికి అప్డేట్ అయ్యే ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular