Huge demand for Indian drones: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగి ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. భారత సైనిక శక్తిని ప్రపంచానికి చాటింది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలతోపాటు పాకిస్తాన్‌లోని 11 ఎయిర్ బేస్‌లపై భారత వైమానిక దళం కచ్చితమైన దాడి చేసింది. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చేసిన ఈ దాడిలో రఫేల్, సుఖోయి యుద్ధ విమానాలతోపాటు బ్రహ్మోస్ క్షిపణులు, డ్రోన్లు కీలకపాత్ర పోషించాయి. నిర్ధిష్ట లక్ష్యాలను కచ్చితంగా చేసుకుని సత్తా చాటాయి. దీంతో భారత ఆయుధాలకుక్షిమాండ్ పెరిగింది. ముఖ్యంగా భారత డ్రోన్ల కొనుగోలుకు అనేక దేశాలు ఆసక్తి చూపుతున్నాయి.
ఆపరేషన్ సిందూర్ భారత సైన్యం సాంకేతిక సామర్థ్యాన్ని, ముఖ్యంగా స్వదేశీ డ్రోన్ల వినియోగాన్ని ప్రపంచానికి చాటింది. ఈ ఆపరేషన్ భారత రక్షణ ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టింది, డ్రోన్లకు డిమాండ్‌ను గణనీయంగా పెంచింది. కచ్చితమైన లక్ష్యాలను చేధించగల ఈ డ్రోన్లు ‘యుద్ధ–పరీక్షిత‘ లేబుల్‌ను సంపాదించాయి, దీనివల్ల విదేశీ మార్కెట్లలో ఆసక్తి పెరిగింది.
Also Read: బిజెపి తదుపరి చీఫ్ ఎవరు? తొలి మహిళా జాతీయ అధ్యక్షురాలు రావచ్చా? రేసులో ఎవరంటే?
డ్రోన్ తయారీ హబ్‌గా బెంగళూరు..
బెంగళూరు భారత డ్రోన్ పరిశ్రమ కేంద్ర బిందువుగా మారింది, ఇక్కడ 550+ సంస్థలు డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో భాగంగా పనిచేస్తున్నాయి. రాఫె ఎం ఫిబిల్ వంటి కంపెనీ తయారు చేసిన డ్రోన్లు ఆపరేషన్ సిందూర్‌లో కీలకపాత్ర పోషించాయి. సాంకేతికతను నిరూపించడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.
భారీగా పెట్టుబడులు..
ఆపరేషన్ సిందూర్ విజయం తర్వాత, భారత డ్రోన్ తయారీ సంస్థలలో పెట్టుబడులు పెట్టేందుకు స్థానిక, అంతర్జాతీయ పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగింది. బెంగళూరు ఆధారిత కంపెనీ రాఫె ఎం ఫిబిల్ సంస్థ ఒక్కటే 100 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సమీకరించింది. ఇది ఈ రంగంలోని వృద్ధి సామర్థ్యాన్ని సూచిస్తుంది. ‘ఆత్మనిర్భర్ భారత్‘ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలు ఈ పెట్టుబడులను మరింత ప్రోత్సహిస్తున్నాయి, డ్రోన్ స్టార్టప్‌లకు ఆర్థిక మద్దతును అందిస్తూ, స్థానిక ఉత్పత్తిని బలోపేతం చేస్తున్నాయి.
Also Read: జాతీయ భాష, అధికారిక భాష మధ్య తేడా ఏమిటి, హిందీ ఎందుకు జాతీయ భాషగా మారలేకపోయింది?
భారత డ్రోన్లకు డిమాండ్..
భారత డ్రోన్లు, సరసమైన ధరలు, యుద్ధ–పరీక్షిత సామర్థ్యంతో, ఆసియా, ఆఫ్రికా, మరియు మిడిల్ ఈస్ట్ దేశాలలో ఎగుమతి అవకాశాలను అన్వేషిస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత డ్రోన్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి. భారత్ కూడా విదేశీ డ్రోన్ల దిగుమతిపై నిషేధం విధించి స్వదేశీ తయారీని ప్రోత్సహిస్తోంది. స్వదేశీ ఉత్పత్తిని పెంచడానికి, ఎగుమతులను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటోంది.