Kodali Nani: మేము జగన్ నుంచి గ్యారేజీ నుంచి వచ్చాము. మాకు పదవులతో పనిలేదు. మాకు పదవే అడ్డంకి. అదే లేకుంటే వీరవిహారం చేస్తాం.. ఈ మాటలన్నది ఎవరో తెలుసా తాజా మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ లు. ఒక విధంగా చెప్పాలంటే వీరు శాఖాపరమైన ప్రగతితోనే ప్రాచుర్యం పొందలేదు. వారి నోటి నుంచి వచ్చే మాటల తూటాలు, వివాదాస్పద వ్యాఖ్యలతోనే గుర్తింపు పొందారు. సొంత పార్టీ వారు వీరిని ఫైర్ బ్రాండ్లుగా అభివర్ణించేవారు. విపక్ష నేతలు బూతుల మంత్రులుగా చెప్పుకునేవారు. ఏ పార్టీతో సంబంధం లేని తటస్థులు, విద్యాధికులు మాత్రం వీరి మాటలను ఏవగించుకునేవారు.
మంత్రి పదవులు ఉన్న సమయంలో తెగ హడావుడి చేసే వీరిద్దరూ ఇటీవల సైలెంట్ అయిపోయారు. అనిల్ కుమార్ యాదవ్ కాస్తో కుస్తో జిల్లా మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డిని ఇబ్బందిపెట్టే పనిలో ఉన్నా.. కొడాలి నాని మాత్రం ఎక్కడా కనిపించలేదు. మంత్రివర్గ విస్తరణలో పదవులు కోల్పోయే సమయంలో సైతం కొడాలి నాని చాలా క్యాజువల్ గా కనిపించారు. తమకు పదవులు త్రుణప్రాయంగా చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా సమర్థులకు పెద్దపీట వేయడానికే మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ అంటూ మీడియా ముందు బడా ప్రకటనలిచ్చారు. అప్పటివరకూ తొలగింపు జాబితాలో తనపేరు ఉండదని బహుశా ఈ ప్రకటన ఇచ్చి ఉంటారు. అంతటితో ఆగకుండా తమకు పదవులు పోయిన పర్వాలేదని.. అధినేత ఇచ్చిన టాస్క్ ను పూర్తిచేస్తామని చెప్పుకొచ్చారు. మంత్రి పదవి తన దూకుడుగా అడ్డమని.. అదే లేకపోతే ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తామని తెగ బిల్డప్ ఇచ్చారు. అయితే ఇది జరిగి సరిగ్గా రెండు వారాలైనా కాలేదు.. ఈ తాజా మాజీ మంత్రి మీడియా ముందుకు రావడానికి ఇష్టపడలేదు. విపక్ష నేతలపై తూలనాడడాన్ని అత్యంత వెన్నతో పెట్టిన విద్యగా భావించే కొడాలి నాని నోటికి తాళం పడడం వెనుక పెద్ద కారణాలే నడుస్తున్నాయన్న టాక్ వైసీపీ వర్గాల్లోనే వినిపిస్తోంది.
Also Read: Prashant Kishor: పీకే వ్యూహాలు కాంగ్రెస్ ను గట్టెక్కిస్తాయా?
తత్వం బోధపడిందా?
చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు ప్రభుత్వంపై చిన్న విమర్శ చేసినా సహించలేని నాని చిందులేసేవారు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేసేవారు. కానీ పదవి పోయే సరికి తాను అన్న మాటలు గుర్తొచ్చినట్టున్నాయి. అందుకే గుడివాడకు పరిమితమయ్యారని తెలుస్తోంది. అయితే ఈ సైలెంట్ వెనుక చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసలు తనను మంత్రి పదవి నుంచి తప్పిస్తారని నాని భావించలేదు. కమ్మ సామాజికవర్గంలో చంద్రబాబుకు దీటుగా తానే ఉన్నానని..తనను తప్పించే సాహసం చేయరని..పైగా తాను జగన్ కు భక్తుడ్ని కానుక టచ్ చేయరని చాలా నమ్మారు.
ఒకరిద్దరు మంత్రుల ను కొనసాగిస్తే.. అందులో తాను ఒకరినని అనుచరుల వద్ద గొప్పగా చెప్పుకున్నారు. కానీ తానొకటి తలస్తే.. జగన్ ఒకటి తలచారని.. మంత్రి నుంచి ఊస్టింగ్ చేశారని తెగ బాధపడుతున్నారు. పైగా కమ్మ సామాజికవర్గం నుంచే ప్రాతినిధ్యం లేకుండా చేశారని ఆక్రోషిస్తున్నారు. ఇది తనకు పొలిటికల్ గా దెబ్బతీస్తుందని భావిస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో కమ్మల ప్రాభల్యం ఎక్కువ. వారికి టీడీపీపై అభిమానం ఉన్నా.. తమ సామాజికవర్గానికి చెందిన నానిని సైతం గెలిపించుకుంటూ వస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా నాని వ్యవహార శైలి వారికి నచ్చడం లేదు. ఇప్పుడు ఏకంగా కులానికి ప్రాతినిధ్యం లేకుండా పోయిందని వారు కుతకుతలాడుతున్నారు. అందుకే వారంతా వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించడానికి నిర్ణయించుకున్నారు. అది తెలిసే నాని తెగ బాధపడిపోతున్నారు. అనవసరంగా లేనిపోని వివాదాల్లో దూరి కోరి కష్టాలు తెచ్చుకున్నానని అనుచరుల వద్ద తన ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. ఇక నుంచైనా కొడాలి నాని వెనక్కి తగ్గుతారో.. లేకపోతే వచ్చే ఎన్నికల్లో గెలిచి మంత్రినవుతానంటూ రంకెలు వేస్తారో చూడాలి.
Also Read:TDP Mahanadu 2022: మహానాడుకు అన్నగారి కుటుంబసభ్యులు… జూనియర్ ఎన్టీఆర్ పైనే చంద్రబాబు ఫోకస్
Recommended Videos:
Web Title: Why minster kodali nani silent
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com