Viral video : కొంతకాలంగా సమాజం పెడపోకడలు పోతోంది. ముఖ్యంగా మద్యం తాగడాన్ని ఒక అలవాటుగా మార్చుకుంది. వేడుకతో సంబంధం లేదు.. జరిగే విషయంతో సంబంధం లేదు.. మద్యం తాగడం మాత్రం కామన్ అయిపోయింది. పైగా ప్రభుత్వాలకు మద్యం ద్వారానే ప్రధాన ఆదాయం వస్తున్న నేపథ్యంలో.. అంతకుమించి అనేలాగా వైన్ షాపులకు ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నాయి. దీంతో పుట్టగొడుగుల మాదిరిగా వైన్ షాపులు ఏర్పాటు అవుతున్నాయి. ఇక బెల్ట్ షాపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీరు లభించని చోటుకుంటుందో తెలియదు కానీ.. బెల్ట్ షాపు లేని ప్రాంతం మాత్రం లేదంటే అతిశయోక్తి కాక మానదు. ప్రభుత్వాలకు డబ్బులు కావలసి రావడంతో.. ప్రాంతాలతో సంబంధం లేకుండా మధ్యధరా సముద్రాన్ని పొంగిస్తున్నాయి. ఆ పొంగుల్లో కాసులను దండుకుంటున్నాయి. ప్రభుత్వాలే ఈ పని చేస్తున్న నేపథ్యంలో ఎవరు అడ్డు చెప్పే పరిస్థితి లేకుండా పోయింది.
Also Read : బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ పక్కన పెట్టి చేపలు తింటున్నారా.. వామ్మో ఇది మామూలు మోసం కాదు.. వైరల్ వీడియో
పామును ఆఫ్ట్రాల్ అనుకున్నాడు
ముందుగానే చెప్పినట్టు మద్యం తాగిన వాడికి లోకం మొత్తం భిన్నంగా కనిపిస్తోంది. అటువంటిదే ఇది కూడా.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి పీకల దాకా మద్యం తాగాడు. తాగిన తర్వాత కొద్దిసేపు ఊగాడు.. అనంతరం తనలో తాను మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. ఒక చెట్టు కింద కూర్చొని.. తనలో తానే సంభాషించుకుంటున్నాడు. మందు మత్తులో ఉన్నాడు కాబట్టి ఎవరూ అతనితో మాట్లాడే సాహసం చేయడం లేదు. కానీ ఇంతలోనే అతని వద్దకు ఒక పాము వచ్చింది. సాధారణంగా పాము అనే పదం వినిపిస్తేనే చాలు మనం భయపడిపోతాం. కానీ ఇతడు మాత్రం అలాగే కూర్చున్నాడు. అంతేకాదు ఆ పాముకు వేమనలాగా సుభాషితాలు చెప్పడం మొదలుపెట్టాడు.. ఒకానొక సందర్భంలో మద్యం తాగినప్పుడు నేను నా భార్యకే భయపడను.. ఆఫ్ట్రాల్ నువ్వు పామువు.. నీకెందుకు భయపడతాను అంటూ అతడు తనలో తానే సంభాషించుకున్నాడు. ఆ పామును చూసి అతడు ఏమాత్రం భయపడకపోగా.. అక్కడే ఉన్నాడు. అంతేకాదు ఆ పామును పురుగును చూసినట్టు చూసాడు. ఈ వ్యవహారాన్ని దూరం నుంచి ఒక వ్యక్తి గమనించి.. తన ఫోన్ కు పని చెప్పాడు. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇంకేముంది దెబ్బకు విస్తృతంగా సర్కులేట్ అవ్వడం మొదలు పెట్టింది. ఈ తాగిన వ్యక్తి ఎవరు? అది ఏ ప్రాంతంలో చోటుచేసుకుంది? అనే విషయాలను మాత్రం ఆ వ్యక్తి ప్రస్తావించలేదు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలకు ఆదరణ ఎక్కువ కాబట్టి.. ఇది కూడా విపరీతంగా ఆదరణ సొంతం చేసుకుంది. లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది.
Also Read : ఛార్జింగ్ అయిపోవడంతో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి స్కూటర్ తోసుకెళ్లిన వ్యక్తి..వీడియో వైరల్