Virat Kohli: “అతన్ని కొనుగోలు చేసి 18 సంవత్సరాలు దాటినప్పటికీ.. ఇప్పటికీ అతడే క్రికెట్ కింగ్ గా ఉన్నాడు. ఇది చాలా గొప్ప ప్రయాణం.. ధన్యవాదాలు విరాట్ కోహ్లీ.. 18 సీజన్లు, ఒకటే జట్టు, ఒకడే స్థిరమైన రాజు” అంటూ రాయల్ చాలెంజెస్ బెంగళూరు పేర్కొంది. సోషల్ మీడియాలో ఒక పోస్టర్ కూడా విడుదల చేసింది. అయితే ఇప్పటివరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపిఎల్ లో ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. ప్రతిసారి ప్లే బోల్డ్ అంటూ నినాదం చేయడం.. ఈసారి కప్ మనదే అంటూ చెప్పడం.. ఆ తర్వాత తేలిపోవడం బెంగళూరు జట్టుకు పరిపాటిగా మారింది. అయితే ఈసారి మాత్రం కచ్చితంగా కప్ కొట్టాలని బెంగళూరు జట్టు భావిస్తోంది. ఇటీవల జరిగిన మెగా వేలంలో యువ ఆటగాళ్ళను బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది. కెప్టెన్ డూ ప్లేసిస్(Do plesis) ను దూరం పెట్టింది. అతడి స్థానంలో రజత్ పాటిదర్ (Rajat Patidar) ను కెప్టెన్ ను చేసింది. ఇదే విషయాన్ని ఇటీవల విరాట్ కోహ్లీ కూడా వెల్లడించాడు. బెంగళూరు జట్టుకు రజత్ పాటిదార్ కొత్త కెప్టెన్ గా నియమితుడయ్యాడని.. అతడికి అందరి ప్రోత్సాహం కావాలని.. అందరి అండదండలతోనే అతడు గొప్ప నాయకుడిగా ఎదుగుతాడని విరాట్ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. ఈ వీడియోను బెంగళూరు జట్టు తన అధికార సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేసింది.
Also Read: టీమిండియా గెలిచిన ఊపులో..వీళ్ళను మర్చిపోయాం..ఇందులో మన ఇండియన్ కూడా ఉన్నాడు..
ఒక్కడే కింగ్
ఐపీఎల్ లో విరాట్, ధోని మాత్రమే తమ జట్లతో స్థిరమైన ప్రయాణం కొనసాగిస్తున్నారు. గత 18 సీజన్లుగా వారు తమ జట్లతోనే ఉన్నారు. ఓటముల్లో, గెలుపుల్లో జట్లనే అంటిపెట్టుకొని ఉన్నారు. చెన్నై జట్టుకు ధోని ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందించగా.. విరాట్ ఇంతవరకు బెంగళూరుకు ట్రోఫీ అందించలేకపోయాడు. అయినప్పటికీ అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న జట్లలో బెంగళూరు కూడా ఒకటి. అత్యంత విలువైన జట్లలో కూడా బెంగళూరు ముందువరుసలో ఉంటుంది. బెంగళూరు లో గత ఏడాది తీవ్రమైన నీటి కరువు ఉన్నప్పటికీ.. ఐపీఎల్ ను దృష్టిలో పెట్టుకొని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ మ్యాచులు నిర్వహించేందుకు ముందుకు వచ్చింది. అంతటి ఇబ్బందికర పరిస్థితుల్లోనూ విరాట్ కోహ్లీ చూడ్డానికి అభిమానులు లక్షలాదిగా తరలివచ్చారు. అందువల్లే విరాట్ కోహ్లీని తమ జట్టులో దీర్ఘకాలం కొనసాగిస్తున్నామని బెంగళూరు యాజమాన్యం పేర్కొంది. మరోవైపు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో గత సీజన్లో బెంగళూరు జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుత సీజన్లోనూ బెంగళూరు జట్టు పర్వాలేదని స్థాయిలోనే ఆట తీరు ప్రదర్శిస్తోంది. కొత్త కెప్టెన్ హయాంలో నైనా బెంగళూరు కప్ సాధిస్తుందా? తొలిసారి విజేతగా ఆవిర్భవిస్తుందా? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించబోతోంది. అన్నట్టు 18 సీజన్లు విజయవంతంగా బెంగళూరు జట్టుతో పూర్తిచేసుకున్న విరాట్ కోహ్లీకి కన్నడ అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ ప్రయాణం ఇలాగే సాగిపోవాలని ఆకాంక్షిస్తున్నారు.