Star Heroine: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మనం చెప్పుకోబోయే హీరోయిన్ ఒకప్పుడు తోపు హీరోయిన్. కేవలం 15 వేల అతి చిన్న వయసులోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈమె దాదాపు 8 భాషలలో వందకు పైగా సినిమాలలో నటించి ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగు తో పాటు ఈ హీరోయిన్ తమిళ్ మరియు మలయాళం భాషలలో కూడా స్టార్ హీరోలు అందరికీ జోడిగా నటించి మెప్పించింది. ప్రస్తుతం మళ్ళీ 14 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ హీరోయిన్ సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 90’ s లో ఉన్న టాప్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. దాదాపు సౌత్ స్టార్ హీరోలు అందరికీ జోడిగా ఈమె నటించింది. 15 ఏళ్ల చిన్న వయసులోనే హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తన అందం, అభినయంతో సినిమా ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. కెరియర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటుంది.
సినిమాలు చేయకపోయినప్పటికీ ఆమె రూ. 2 వేల కోట్లకు మహారాణి. సినిమా ఇండస్ట్రీలో దాదాపు 100కు పైగా సినిమాలలో నటించి రికార్డును క్రియేట్ చేసింది. పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయిన తర్వాత ఇన్నేళ్లు ఫ్యామిలీతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం 14 ఏళ్ల తర్వాత సినిమాలలో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఈమె మరెవరో కాదు టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రంభ. 1993 లో రిలీజ్ అయిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో రంభ తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమాలో రంభ రాజేంద్రప్రసాద్ కు జోడిగా నటించింది. ఆ తర్వాత తెలుగుతోపాటు తమిళ్, మలయాళం భాషలలో కూడా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తెలుగులో అగ్ర హీరోలు అయినా మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఇలా దాదాపు అందరూ స్టార్ హీరోలకు జోడిగా నటించింది. ప్రపంచవ్యాప్తంగా రంభ అలగీయ లైలా అనే పాటతో బాగా ఫేమస్ అయ్యింది. తక్కువ సమయంలోనే వరుస అవకాశాలు అందుకొని స్టార్ డంను సంపాదించుకుంది. చివరిసారిగా ఈమె పెన్ సింగం అనే సినిమాలో నటించింది. అలాగే ఈమె సినిమాలలో స్పెషల్ సాంగ్స్ లో కూడా అలరించింది. ఆ తర్వాత రంభ 2010లో కెనడియన్ వ్యాపారవేత్త అయిన ఇంద్ర కుమార్ పద్మనాభం ను పెళ్లి చేసుకుని విదేశాలలో సెటిల్ అయిపోయింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు మరియు ఒక కొడుకు ఉన్నారు.