Teenmar Mallanna funny satires: సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాల వీడియోలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక యూట్యూబ్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో కొంతమంది సొంతంగా చానల్స్ పెట్టుకొని.. వార్తా విశ్లేషణ నుంచి మొదలుపెడితే ఫుడ్ వ్లాగింగ్ వరకు చాలా చేస్తున్నారు. ఇందులో కొంతమంది క్లిక్ అయితే.. చాలామంది ఫెయిలయ్యారు. అయితే విజయవంతమైన వారి జాబితాలో ముందు పేరు మాత్రం తీన్మార్ మల్లన్నది ఉంటుంది.
తీన్మార్ మల్లన్న గతంలో పాత్రికేయుడిగా పని చేశారు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. క్యూ న్యూస్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే శక్తిగా ఆయన ఎదిగారు. చాలా సందర్భాల్లో జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచారు. ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఆయన చేసిన కొన్ని ప్రకటనలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. దీంతో ఆయనను పార్టీ సస్పెండ్ చేసింది…
ప్రస్తుతం తీన్మార్ మల్లన్న రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. దాంతోపాటు క్యు న్యూస్ ఛానల్ కూడా నిర్వహిస్తున్నారు. క్యూ న్యూస్ ఛానల్లో వార్తా విశ్లేషణ చేసే ఆయన.. ఇటీవల ఒక బాధితుడు తన వద్దకు రాగా.. అతడు ఎదుర్కొన్న బాధను ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశారు. ఆ వ్యక్తి ఓ సబ్ ఇన్ స్పెక్టర్ చేతిలో దెబ్బలు తిన్నాడు. ఆ ఎస్ ఐ కొట్టిన దెబ్బలకు ఆ వ్యక్తి గాయపడ్డాడు. ఈ కార్యక్రమంలో తన బాధను తీన్మార్ మల్లన్నకు ఆ వ్యక్తి చెప్పుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. తీన్మార్ మల్లన్న ఆ వ్యక్తి పడిన బాధను మరో కోణంలో చెప్పాడు.
ఆ వ్యక్తిని ఎస్ఐ కొడుతున్నప్పుడు వేసుకున్న లాగును విప్పి చూసాడట. ఆ తర్వాత ఫోటోలు కూడా తీసుకున్నారట. ఆ ఫోటోలను ఎవరికో పంపించాడట. ఇదే విషయాన్ని ఆ బాధిత వ్యక్తి తీన్మార్ మల్లన్నకు చెప్పాడు. దీన్ని తీన్మార్ మల్లన్న మరో కోణంలో చెప్పి ఆ ఎస్సై పరువు తీశాడు. ఇప్పుడు ఇక ఈ వీడియో యూట్యూబ్లో ఒక సంచలనంగా మారింది.. ” లాగులు ఏంది.. ఫోటోలు తీసుడేంది.. ఈ అలవాటు ఏంది.. దీని ద్వారా ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారని” తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించడం సంచలనం కలిగిస్తోంది.
