Homeజాతీయ వార్తలుA Heartbreaking video: బిడ్డల కోసం ఈ తండ్రి ఆకలి మర్చిపోయాడు.. అన్నాన్ని చూడగానే కన్నీళ్లు...

A Heartbreaking video: బిడ్డల కోసం ఈ తండ్రి ఆకలి మర్చిపోయాడు.. అన్నాన్ని చూడగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు.. గుండె బరువెక్కించే వీడియో.

A Heartbreaking video: ఇంటికి దీపం ఇల్లాలు అంటారు.. ఆ దీపం సక్రమంగా వెలగాలంటే ఆ ఇంటికి కామందు ఉండాలి. ఆ కామందు సక్రమంగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది. ఇంట్లో దీపం దివ్యంగా వెలుగుతూ ఉంటుంది. ఇల్లు అలా ఉండడానికి.. దీపం అలా వెలుగుతూ కాంతిని ప్రసరించడానికి ఇంటి కామందు కష్టపడుతూనే ఉంటాడు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. అయితే ఇల్లాలికి దక్కిన గౌరవం ఇంటి కామందుకు దక్కదు.

తల్లి చూపించే ప్రేమ ప్రపంచానికి తెలుస్తుంది. తండ్రి పడే కష్టం మాత్రం రెండవ కంటికి కూడా తెలియదు అంటారు. ఇతడి పరిస్థితి కూడా అలాంటిదే. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఆ వీడియోలో.. ఆ వ్యక్తి ఒక డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. వయసు 45 సంవత్సరాల వరకు ఉంటుంది. ఫుడ్ డెలివరీలు చేసి చేసి.. అతడు ఆకలిని కూడా మర్చిపోయాడు. కన్న పిల్లల కడుపు నింపడానికి.. కట్టుకున్న భార్యకు కడుపునిండా అన్నం పెట్టడానికి అతడు డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతనికి కొన్ని ఆర్డర్లు వచ్చాయి. ఆ ఆర్డర్లను ఇవ్వడానికి అతడు వెళ్ళాడు.

ఆ ఆర్డర్లు స్వీకరించిన వ్యక్తులు అతడి ముఖాన్ని చూసి ఆందోళన చెందారు. ఆకలిగా ఉన్నాడని గుర్తించారు. ఈ క్రమంలోనే తెచ్చిన ఆహారాన్ని తినమని అతడికి చెప్పారు. అంతేకాదు కుర్చీలో కూర్చోబెట్టి.. ఒక అతిధి మాదిరిగా అతడికి సపర్యలు చేశారు. ప్లేట్లో ఆహారాన్ని పెట్టారు.. ఆ అన్నాన్ని అలా చూడగానే అతడు ఒకసారిగా కన్నీటి పర్యంతమయ్యాడు. ” నాకు ఆకలి వేస్తుందని.. అన్నం తింటే అది తీరుతుందని నేను మర్చిపోయాను. పిల్లలు.. కట్టుకున్న భార్యకు ఆహారం పెట్టడానికి నిరంతరం శ్రమిస్తున్నాను. అందువల్లే నేను ఆకలి అనే విషయాన్ని మర్చిపోయాను.” అంటూ ఆ వ్యక్తి కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ వీడియో ఇప్పుడు విపరీతంగా సర్కులేట్ అవుతోంది. అంతేకాదు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీస్తోంది. కన్నతల్లి ప్రేమను పంచుతుంది. కన్నతండ్రి కడుపు నింపుతాడు. ప్రేమ బయటికి కనిపిస్తుంది. కన్న తండ్రి బాధ్యత మాత్రం గుర్తింపునకు నోచుకోకుండా మరుగున పడుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version