Extramarital Affair: పచ్చని సంసారాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చు రేపుతున్నాయి. మొగుడు ఉండగానే పరాయి మగాడితో సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసే వారు చాలా మంది ఉన్నారు. వారంతా తమ సుఖం కోసం చూస్తున్నారే కానీ సంసారం చెల్లాచెదురవుతుందని అనుకోవడం లేదు. ఫలితంగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో ఏం సమాధానం చెప్పలేని పరిస్థితి. భర్త ఉండగా పరాయి వాడి అవసరమేంటి? అతడితో గంటల కొద్దీ సరదాగా గడుపుతూ తామేదో సాధిస్తున్నామని అనుకుంటున్నారు కానీ తమ సంసారం కకావికలం అవుతుందని మాత్రం గుర్తించడం లేదు

తాజాగా ములుగు జిల్లాలో జరిగిన ఓ సంఘటన ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. భార్య అటవీ శాఖలో ఉద్యోగం చేస్తుండగా భర్త పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. వీరిద్దరు ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుననారు. ఈ నేపథ్యంలో ఊళ్లు దూరంగా ఉండటంతో విడివిడిగా ఉంటున్నారు.దీంతో ఆమె తన తో చదువుకున్న వ్యక్తితో ప్రేమలో పడింది. ఇంకేముంది రోజు తన గదిలో గంటల కొద్ది గడుపుతూ సుఖ పడుతోంది. కట్టుకున్న భర్తను పట్టించుకోవడం లేదు.
Also Read: Acharya: ఆచార్య ప్లాప్ టాక్ రావడానికి ఇవే 10 కారణాలు..
ఈ క్రమంలో అనుమానం వచ్చిన భర్త తన భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని పంచాయితీ పెట్టాడు. దీంతో ఆమె తల్లి అల్లుడిని నానా మాటలు అంది. తన కూతురుపై నిందలు వేస్తే ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేసింది. దమ్ముంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని సవాలు చేసింది. దీంతో అతడు భార్యపై నిఘా పెంచాడు. వారి కాల్ లిస్ట్ ఆధారంగా ఎక్కడ కలుసుకుంటున్నారనే దానిపై మాటు వేశాడు.

దీంతో ఇద్దరు ఒకే గదిలో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. దీంతో ఆమె పనిచేసే ఊరికే తీసుకుపోయి పెద్ద మనుషుల సమక్షంలోనే పంచాయితీ పెట్టి వారి గుట్టు రట్టు చేశారు. దీంతో ప్రియుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఏదో మా విషయం ఎవరికి తెలియదని నమ్ముతూ ఇంత బరితెగించిన ఆమెపై అందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చని సంసారంలో చిచ్చు రాసేసిన ఆమెపై శాపనార్థాలు పెట్టారు.
Also Read:Films in May: మే లో రిలీజుకు రెడీ అవుతున్న చిత్రాలివే..!