Minister KTR: తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పార్టీలు ముమ్మరంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో రెండో విడత ఏప్రిల్ 14న ప్రారంభించింది. మరోవైపు కాంగ్రెస్ కూడా వరంగల్ లో ఈనెల 6న రైతు సంఘర్షణ సభ నిర్వహించి తన పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది. టీఆర్ఎస్ కూడా నేతల్లో ఉత్తేజం నింపే విధంగా ఏదో చేయాలని తాపత్రయ పడుతోంది. దీంతో రాష్ట్రంలో ఇంకా ఏం పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు.
టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదకతో గుండెలు బాదుకుంటోంది. కేవలం 20 మంది మాత్రమే వచ్చే ఎన్నికల్లో గెలుస్తారని సర్వే నిర్వహించి చెప్పడంతో టీఆర్ఎస్ లో గుబులు మొదలైంది. అందుకే దిద్దుబాటు చర్యలకు పూనుకుంటున్నా పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీనికి తోడు కాంగ్రెస్ ఈనెల 6న వరంగల్ సభ నిర్వహించి జనంలోకి పోవాలని భావిస్తోంది. ఈ పరిణామాల్లో టీఆర్ఎస్ పార్టీకి మింగుడుపడటం లేదని తెలుస్తోంది.
Also Read: Senior NTR: రెండు రోజులైనా ఎన్టీఆర్ లేవలేదు.. ఆమె ఏడుస్తూనే ఉంది !
మరోవైపు టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి కొత్త వాదన తెస్తున్నారు. బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని చెబుతున్నారు. లోపాయకారి ఒప్పందంలో భాగంగానే వారు నాటకాలు ఆడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. మోడీ కేసీఆర్ తోడు దొంగలని చెబుతున్నారు. లేకపోతే ఇన్ని రోజులుగా కేసీఆర్ ను జైలుకు పంపుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతున్నా ఆచరణలో కనిపిస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీల దారులు కూడా మారుతున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు కాలం చెల్లింది. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని జోస్యం చెబుతున్నారు. పీకే వచ్చినా ఎవరు సలహాలు ఇచ్చినా టీఆర్ఎస్ కు మూడో స్థానమే ఖాయమని అంటున్నారు. దీంతో ఇక రాష్ర్టంలో మరోమారు రాజకీయ వేడి రాజుకుంటోంది. పార్టీల మధ్య రగడ రేగుతోంది. పరస్పర ప్రకటనలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. రాహుల్ గాంధీ రాకతో మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ కు ప్రత్యర్థి కేఏ పాల్ అని చెప్పడం ఆయన తెలివికి నిదర్శనం. కేఏ పాల్ పార్టీ ఉందా? రాష్ట్రంలో ప్రవేశించిందా? లేక కేటీఆర్ భయం వ్యక్తం చేస్తున్నారా? అని ఎద్దేవా చేశారు. మొత్తానికి రాష్ర్టంలో త్రిముఖ పోరు అనివార్యమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ తమ విధానాల రూపకల్పనలో నిమగ్నమైనట్లు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ ప్రజల్లో నిలుస్తుందో తెలియడం లేదు.
ఇటీవల ఏపీ విషయంలో కూడా కలుగజేసుకుని వారితో కూడా నానా మాటలు అనిపించుకున్నారు. ఆయన మాటల్లో ఏదో తెలియని భయం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా మాట్లాడితే రాజకీయాల్లో నెగ్గుకు రావడం కష్టమే అంటున్నారు. మొత్తానికి ఆయన వ్యాఖ్యలు ఎక్కడికి దారి తీస్తాయో కూడా తెలియడం లేదు.
Also Read:Rahul Gandhi party video: అమ్మాయిలతో అడ్డంగా బుక్కైన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్