Tamil Nadu Assembly Elections 2026 Survey: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. తమిళనాడు, పుదుచ్చేరి, కేరల, పశ్చిమబెంగాల్, అస్సాంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈమేరకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అయితే దేశ ప్రజల దృష్టి ప్రధానంగా తమిళనాడు, పశ్చిమబెంగాల్‌పైనే ఉంది. తమిళనాడులో హీరో విజయ్ కొత్తపార్టీ ఎలాంటి ప్రభావం చూపుతుందని, బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందా అని ఆసక్తిగా చూస్తున్నారు. ఈ తరుణంలో తమిళనాడుకు సంబంధించిన సర్వే ఫలితాలు షాక్‌కు గురిచేస్తున్నాయి.
Also Read: విజయ్ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ పవన్ కళ్యాణ్ మండిపాటు.. వీడియో వైరల్!
ఎవరికీ మెజారిటీ రాదు..
ఎన్నికల్లో డీఎంకే కూటమి 104–114 స్థానాలు సాధించే అవకాశం కనిపిస్తోంది, మెజారిటీ 118కు సమీపంలో పోరాడుతుంది. అన్నాడీఎంకే 127 స్థానాలతో ఆధిక్యంలో ఉందని తాజా సర్వేలు సూచిస్తున్నాయి. ఈ రెండు ప్రధాన పక్షాలు అధికార గెలుపు కోసం పోటీపడుతున్నాయి, కానీ నిర్ణయాత్మక మలుపు కొత్త శక్తుల నుంచి రావచ్చు.
చక్రం తిప్పేది టీవీకేనే..
హోరో విజయ్ సారథ్యంలోని టీవీకే 15 శాతం ఓట్లతో గణనీయ పాత్ర పోషిస్తుంది, యువత, అసంతృప్తి ఓట్లను ఆకర్షిస్తోంది. డీఎంకే అసంతృప్త ఓట్లు అన్నాడీఎంకేకు కాకుండా విజయ్ వైపు మళ్లే అవకాశం ఉంది. అన్నాడీఎంకే నుంచి సెంగోట్టయన్ వంటి నేతలు చేరడం ద్వారా ఓటు బ్యాంకు బలపడుతోంది, దీనితో ఎన్నికల ఫలితాలు మారే అవకాశం ఉంది.
బలపడనున్న ఎన్‌టీకే..
నామ్ తమిళర్ కట్చి 8 శాతం ఓట్లతో నాల్గవ స్థానం దక్కించుకుంటుందని అంచనా. ప్రతి ఎన్నికల్లో ఈ పార్టీ ఓటు శాతం పెరుగుతూ పోతోంది. ఈ పార్టీ స్థానాల కంటే ఓటు ప్రభావంతో ప్రధాన పోటీదారులను ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలంలో ఇది రాజకీయ దృశ్యాన్ని మార్చే శక్తిగా మారవచ్చు.
కీలక అంశాలు ఇవే..
విజయ్‌పై వ్యక్తిగత వివాదాలు, కరూర్ కేసులు ప్రభావం చూపవచ్చు, అయినా సర్వేలు ఆయన్ను కింగ్‌మేకర్‌గా చూపుతున్నాయి. డీఎంకే కంచుకోట ప్రాంతాల్లో టీవీకే ఓట్లు స్వల్ప తేడాలతో ఫలితాలను ప్రభావితం చేస్తాయి. రాజకీయ నిపుణులు స్టాలిన్, పళనిసామి మధ్య విజయ్ నిర్ణయ శక్తిగా ఉంటాడని అంచనా వేస్తున్నారు.
సర్వేలు డీఎంకే ప్రతిపత్తిని బలపరుస్తున్నాయి, కానీ టీవీకే ఓట్లు అధికార ఏర్పాటును మార్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికలు తమిళనాడు రాజకీయాల్లో రాజకీయ సంకీర్ణతలను పెంచుతాయి.
