Virat Kohli: భారత జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఆటతీరు అందరికి తెలిసిందే. మైదానంలో దిగాడంటే చెలరేగాల్సిందే. తన బ్యాట్ తో బౌలర్ల పని పట్టాల్సిందే. రికార్డులలో కూడా ఎవరికి తీసిపోడు. అనితర సాధ్యమైన అరుదైన ఘనతలెన్నో సాధించాడు. తన కెరీర్ లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. పాత రికార్డులనెన్నో బ్రేక్ చేశాడు. కొంతకాలం ఫిట్ నెస్ విషయంలో ఇబ్బంది పడినా ప్రస్తుతం ఆసియా కప్ నుంచి చెలరేగి ఆడుతున్నాడు. ఈ క్రమంలో 46 శతకాలు బాదిన కోహ్లి మరో రికార్డు అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.

ఇప్పటికి అత్యధిక సంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ టెండుల్కర్ (49) కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో దాన్ని బ్రేక్ చేసేందుకు విరాట్ చూస్తున్నాడు. ఈ సంవత్సరం పెద్ద మొత్తంలో వన్డే మ్యాచ్ లు ఉండటంతో సచిన్ రికార్డును అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. పైగా ఫిట్ నెస్ కూడా అతడికి కలిసొచ్చే అంశమే. దీంతో ఈ ఏడు సచిన్ రికార్డును సమం చేసి మరో అద్వితీయమైన ఘనత సాధించాలని భావిస్తున్నాడు. దీని కోసమే నిరంతరం శ్రమిస్తున్నాడు. వచ్చే మ్యాచ్ ల్లో సెంచరీలు బాదడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాడు.
Also Read: Union Budget 2023-24: కేంద్ర బడ్జెట్ 2023: ఏవి పెరిగాయి.. ఏవి తగ్గాయి..?
తిండి విషయంలో చాలా మంది శ్రద్ధ తీసుకున్నా విరాట్ మాత్రం ఏ రకమైన నిబంధనలు పాటించడు. జంక్ ఫుడ్స్ కూడా తీసుకుంటాడు. చాలా మంది క్రికెటర్లు పాతికేళ్ల వరకు ఎలాంటి డైట్ నిబంధనలు పాటించకున్నా తరువాత మాత్రం ఫిట్ నెస్ పై దృష్టి పెడతారు. కట్టుదిట్టమైన నిబంధనలు పెట్టుకుంటారు. ఫిబ్రవరి 9తో ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్ లో విరాట్ పరుగుల వరద పారించాలని చూస్తున్నాడు. ఆసీస్ మీద కోహ్లి రికార్డు బాగానే ఉంది. దీంతో కోహ్లి మరో రికార్డు సాధించడానికి కంకణం కట్టుకున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికే వన్డే మ్యాచ్ ల్లో ప్రపంచ నెంబర్ వన్ గా ఉన్న భారత్ టెస్టుల్లో కూడా అదే స్థానాన్ని కొనసాగించాలంటే ఆసీస్ పై టెస్ట్ విజయం నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. విరాట్ కోహ్లి తన కెరీర్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా తన పేరును చిరస్థాయిగా నిలుపుకోవాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే తన ఆటతీరును మెరుగుపరుచుకుంటున్నాడు. కోహ్లి ఫుడ్ విషయంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏది దొరికినా తినేందుకు వెనకాడడని చెబుతున్నారు.
Also Read:Income Tax In Budget 2023: కేంద్ర బడ్జెట్ : వేతన జీవులకు ఊరట.. ఆయాచిత వరం ఇచ్చిన నిర్మల
