Venkatesh Aadarsa Kutumbam: ‘సంక్రాంతికి వస్తున్నాం ‘ వంటి భారీ ఇండస్ట్రీ హిట్ తర్వాత విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) చేస్తున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం'(Aadarsa Kutumbam). త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై షూటింగ్ ప్రారంభం దశ నుండే ట్రేడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఎందుకంటే ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు కావడం, భారీ హిట్ తర్వాత వెంకటేష్ నటిస్తున్న సినిమా కావడం , నువ్వు నాకు నచ్చావ్ , మల్లీశ్వరి లాంటి కల్ట్ క్లాసిక్ చిత్రాల తర్వాత వీళ్లిద్దరి కలయిక రాబోతున్న సినిమా కావడం తో , ఈ చిత్రం పై అంచనాలు వేరే లెవెల్ లో ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా స్టోరీ కి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతోంది. టైటిల్ ని చూసి ఈ సినిమా చాలా సాఫ్ట్ గా ఉండబోతుంది అనుకుంటే పెద్ద పొరపాటే.
Also Read: మంచు విష్ణు ఆ ఒక్క సినిమా నాకోసం వదిలేయమని ప్రభాస్ ను అడిగాడా..? ఆ సినిమా ఏంటంటే..?
ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం నువ్వు నాకు నచ్చావ్ తరహా లో చాలా సరదాగా సాగిపోతుందట . కానీ ఇంటర్వెల్ లో వచ్చే ఒక ట్విస్ట్ వేరే లెవెల్ లో ఉంటుందని. అతడు చిత్రం లో ఎలా అయితే క్రైమ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుందో, ఈ సినిమాలో కూడా అలాంటి ఎలిమెంట్ ఉంటుందని, అది ఈ చిత్రాన్ని వేరే లెవెల్ కి తీసుకెళ్తుందని అంటున్నారు. మంచి కుటుంబ విలువలతో పాటు, యాక్షన్ కూడా చాలా బలంగానే ఉంటుందట. డైరెక్టర్ త్రివిక్రమ్ తన గత చిత్రం ‘గుంటూరు కారం ‘ విషయం లో చేసిన తప్పులను క్షుణ్ణంగా పరిశీలించి, అవి పునరావృత్తం కాకుండా, చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడట. కచ్చితంగా మూవీ లవర్స్ కి ఒక విజువల్ ఫీస్ట్ లాగా ఉండబోతుంది ఈ చిత్రం.
ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఆగస్టు నెలలో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు. ప్రమోషనల్ కంటెంట్ ని ఈ వేసవి నుండే మొదలు పెడతారట మేకర్స్. ముందుగా ఒక బ్లాస్టింగ్ టీజర్ ని ఈ ఉగాదికి వదిలే ఆలోచనలో ఉన్నారట. ఈ చిత్రానికి హర్షవర్ధన్ సంగీతం అందిస్తున్నాడు. త్రివిక్రమ్ , వెంకటేష్ ఇద్దరికీ కూడా ఫ్యామిలీ ఆడియన్సు లో మంచి క్రేజ్ ఉంది. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం ‘ రేంజ్ హిట్ గా నిలిస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఈసారి 400 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.