Pawan Kalyan- Nani: సందీప్ కిషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన పాన్ ఇండియన్ చిత్రం ‘మైఖేల్’ చిత్రం మరికొద్ది రోజుల్లోనే విడుదల కాబోతుంది..ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని ఇటీవలే విడుదల చెయ్యగా దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది..ఈ సినిమాలో సందీప్ కిషన్ తో పాటుగా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఒక ముఖ్యపాత్రలో నటించాడు..ఆయనతో పాటుగా వరుణ్ సందేశ్ కూడా ఇందులో నటించాడు..ఇందులో హీరోయిన్ దివ్యంషా కౌశిక్ నటించింది.

ఈమె నాగ చైతన్య హీరో గా నటించిన మజిలీ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపుని తెచ్చుకుంది..అలా భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా సందీప్ కిషన్ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని ఆయన బలంగా నమ్ముతున్నాడు..అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో జరిపారు.
Also Read: Hari Hara Veera Mallu: బ్రేకింగ్ : రెండు భాగాలుగా రాబోతున్న పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరయ్యాడు..ఈ సందర్భంగా ‘మైఖేల్’ మూవీ టీం నాని గురించి ప్రత్యేకమైన AV ని ప్రదర్శించారు..ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి నేడు న్యాచురల్ స్టార్ గా ఎదిగిన నాని సినీ ప్రస్థానం గురించి చాలా గొప్పగా ఆ ఏవీ లో చూపించారు.

అదే ఏవీ లో ‘అంటే సుందరానికి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి నాని గురించి గొప్పగా మాట్లాడిన మాటలను ప్లే చేసారు..అది చూసిన నాని కి ఆనందంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి..నాని గురించి దాదాపుగా ప్రతీ సెలబ్రిటీ మంచిగానే మాట్లాడారు..కానీ పవన్ కళ్యాణ్ మాటలకే నాని అంతలా ఎమోషనల్ అయ్యాడంటే పవన్ కళ్యాణ్ మీద ఆయనకి ఉన్న అభిమానం ఎలాంటిదో అర్థం అవుతుందని పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో పోస్టులు వేస్తున్నారు.
Also Read: Sai Pallavi: ఆ మూడు ఉంటే చాలు… షార్ట్ గా చెప్పేసిన సాయి పల్లవి!
