Homeఎంటర్టైన్మెంట్Munna Re Release Collection: రీ రిలీజ్ హిస్టరీ లోనే అతి తక్కువ వసూళ్లు.. ప్రభాస్...

Munna Re Release Collection: రీ రిలీజ్ హిస్టరీ లోనే అతి తక్కువ వసూళ్లు.. ప్రభాస్ ‘మున్నా’ పరిస్థితి ఇది!

Munna Re Release Collection: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) కెరీర్ లో బాగున్న కొన్ని సినిమాలు అప్పట్లో కొన్ని కారణాల వల్ల ఫ్లాప్ అయ్యాయి. అలాంటి చిత్రాల్లో ఒకటి ‘మున్నా’ . వరుస హిట్స్ తో దూసుకుపోతున్న దిల్ రాజు ప్రొడక్షన్ నుండి వచ్చిన చిత్రమిది. వంశీ పైడిపల్లి ఈ చిత్రం ద్వారానే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. ప్రభాస్ ని అప్పటి వరకు ఎవ్వరూ చూపించని గెటప్ లో , చాలా స్టైలిష్ గా , అందంగా చూపించాడు. మంచి స్టోరీ , పాటలు , యాక్షన్ సన్నివేశాలు , ఇలా అన్నీ కూడా ఈ చిత్రం లో ఉంటాయి. కానీ ఎందుకో అప్పటి ఆడియన్స్ కి ఈ చిత్రం నచ్చలేదు. అప్పట్లో నచ్చని ఎన్నో సినిమాలు , రీసెంట్ గా రీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్స్ గా నిలిచాయి. అందుకు బెస్ట్ ఉదాహరణ ఆరెంజ్ , ఖలేజా వంటివి.

Also Read: మంచు విష్ణు ఆ ఒక్క సినిమా నాకోసం వదిలేయమని ప్రభాస్ ను అడిగాడా..? ఆ సినిమా ఏంటంటే..?

‘మున్నా ‘ కూడా ఆ రెండు చిత్రాలు లాగానే సక్సెస్ అవుతుందని అనుకోని, నిర్మాత దిల్ రాజు దీనిని 4K కి మార్చి నిన్న గ్రాండ్ గా విడుదల చేశారు . కానీ ఈ చిత్రం ప్రింట్ ఖర్చుల్లో సగం కూడా రాబట్టలేకపోయింది. ప్రింట్ ని 4k కి మార్చడానికి అయిన ఖర్చు అక్షరాలా 25 లక్షల రూపాయిలు. కానీ ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన వసూళ్లు కేవలం 10 లక్షల రూపాయిలు మాత్రమే. నార్త్ అమెరికా , UK వంటి ఓవర్సీస్ మర్కెట్స్ లో కూడా ఈ చిత్రాన్ని మంచి సోషల్ మీడియా పబ్లిసిటీ తో విడుదల చేశారు, కానీ రెస్పాన్స్ మాత్రం నిల్. ఇంత తక్కువ గ్రాస్ వసూళ్లు రీ రిలీజ్ హిస్టరీ లో ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా నమోదు అవ్వలేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఈ సినిమాకు ఇంత పూర్ రెస్పాన్స్ రావడానికి కారణం ప్రభాస్ అభిమానులు ప్రోత్సహించకపోవడం వల్లే. అసలే వాళ్ళు ఈ ‘రాజా సాబ్ ‘ మూవీ ఫ్లాప్ కారణంగా పూర్తి స్థాయి నిరాశలో ఉన్నారు. సోషల్ మీడియా లో అనేక మంది ప్రభాస్ అభిమానులు ఆఫ్ లైన్ కి వెళ్లిపోయారు. వీళ్లంతా మళ్లీ ప్రభాస్ కొత్త సినిమా విడుదలైనప్పుడు మాత్రమే అందుబాటులోకి వస్తారు. కేవలం మున్నా మాత్రమే కాదు, గత వారం విడుదలైన మహేష్ బాబు అతడు చిత్రానికి కూడా ఇలాంటి రెస్పాన్స్ వచ్చింది . కేవలం 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను మాత్రమే ఈ చిత్రం రాబట్టింది. అంత పెద్ద క్లాసిక్ చిత్రానికే అంత తక్కువ వసూళ్లు వస్తే, ఇక మున్నా ని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి ?, జనాలు , అభిమానులు ఇప్పుడు రీ రిలీజ్ చిత్రాలను ప్రోత్సహించే మూడ్ లో లేరని స్పష్టంగా తెలుస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version