Tarakaratna Health: నుదిటన కుంకుమ బొట్టు. వైట్ అండ్ వైట్ ఖద్దర్ దుస్తులు. నలుపు తెలుపు రంగులతో నెరిసిన గడ్డం. ఓ రాజకీయ నాయకుడి ఆహార్యం. చూపుల్లో గాంభీర్య. ఇది కుప్పం పాదయాత్రకు ముందు తారకరత్నగురించి కుటుంబ సభ్యుల ఊహాచిత్రం. ఇంతలోనే వెంటిలేటర్ పై చావుబతుకుల మధ్య ఉన్న తారకరత్న చిత్రం ఊహకందనిది. కలలో కూడా ఊహించనిది. ఇప్పటికీ తారకరత్న ఆరోగ్యం పై స్పష్టత రాకపోవడం రక్తసంబంధీకుల్ని వేదనకు గురిచేస్తోంది.

నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయలో వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోంది. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కానీ మంగళవారం విడుదల చేయలేదు. ఇంకొన్ని పరీక్షలు అవసరమని వైద్యులు భావిస్తున్న నేపథ్యంలో .. మిగిలిన పరీక్షలు చేశాక హెల్త్ బులెటిన్ బుధవారం విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం వెంటిలేటర్ పైనే చికిత్స కొనసాగుతోంది. ఎక్మో ద్వార చికిత్స అందిస్తున్నట్టు వచ్చిన వార్తలను కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు.
Also Read: Union Budget 2023-24: కేంద్ర బడ్జెట్ 2023: ఏవి పెరిగాయి.. ఏవి తగ్గాయి..?
మెదడుకు సంబంధించి సిటీ స్కాన్ పరీక్షల రిపోర్టు రావాల్సి ఉందని, బుధవారం మరికొన్ని పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు చెబుతున్నారు నారాయణ హృదయాలయలో నిపుణులైన వైద్యుల బృందం నిరంతర పర్యవేక్షణలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. మరికొన్ని పరీక్షల అనంతరం తారకరత్నకు సంబంధించిన హెల్త్ బులెటిన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం తారకరత్న తండ్రి మోహనకృష్ణ, భార్య అలేఖ్యరెడ్డి ఆస్పత్రిలో ఉన్నారు.

హెల్త్ బులెటిన్ విడుదల అయిన తర్వాత తారకరత్న ఆరోగ్యం పై స్పష్టత రానుంది. మరికొన్ని పరీక్షలు నిర్వహించాకే వైద్యులు తదుపరి చికిత్సను కొనసాగించనున్నారు. . ప్రస్తుతం తారకరత్న ఐసీయూలో చికిత్స పొందుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తారకరత్న త్వరగా కోలుకోవాలని అభిమానులు, కుటుంబసభ్యులు కోరుకుంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
