
Windows: మనం ఇల్లు కట్టుకునే సమయంలో అన్ని సవ్యంగా ఉండాలని చూసుకుంటారు. ఏ చిన్న లోపం ఉన్నా ఇంటి వాస్తు దెబ్బ తింటుంది. ఈ నేపథ్యంలో ఇంటి వాస్తు బాగుండాలని ప్రయత్నిస్తుంటాం. దీనికి మన ఇల్లు సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై స్పష్టత ఉండాలి. మన ఇంటికి ఎన్ని కిటికీలు అమర్చుకోవాలనే విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి.
కిటికీల సంఖ్య ఎంత ఉండాలి?
కిటికీల సంఖ్య ఎప్పుడు సరిసంఖ్యలోనే ఉండాలి. 2,4,6,8,10 ఇలా సరిసంఖ్యలోనే కిటికీలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. బేసి సంఖ్యలో కిటికీలు అమర్చుకోకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి కిటికీల ఎంపిక ప్రాధాన్యం సంతరించుకుంటుంది. కిటికీలు పెద్దగా వెలుతురు ఉండేలా చూసుకోవాలి. గాలి, వెలుతురు ధారాళంగా ఉంటేనే సురక్షితం.
ఏ దిశలో ఉండాలి?
కిటికీలు ఏ దిశలో ఏర్పాటు చేసుకోవాలి. ఇంటికి తూర్పు, ఉత్తర, పడమర దిశల్లో ఏర్పాటు చేసుకోవాలి. దక్షిణ దిశలో యముడు ఉంటాడు కాబట్టి ఇటు వైపు కిటికీలు ఏర్పాటు చేసుకోవడం మంచిది కాదు. తూర్పు దిశ సూర్యుడికి ఇష్టమైన దిక్కు కావడంతో ఇటు వైపు కిటికీలు పెట్టుకోవడం ఉత్తమం. ఇక ఉత్తర దిశ కుబేరస్థాన కావడంతో ఇటు వైపు కూడా కిటికీలు అమర్చుకోవడం మంచిది. ఇక పడమర వైపు కూడా కిటికీలు ఏర్పాటు చేసుకుంటే గాలి బాగుంటుంది. అందుకే ఇటు వైపు కూడా కిటికీలు ఉంచుకోవడం మేలు.

ఎలా ఉండాలి?
కిటికీలు పాతవి ఉండకూడదు. విరిగినవి కూడా వాడకూడదు. వాస్తు ప్రకారం కిటికీలు వాస్తు పద్ధతులను కచ్చితంగా పాటిస్తూ కిటికీలు పెట్టుకుంటే మనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కిటికీలు తెరిచేటప్పుడు శబ్ధాలు రాకూడదు. ఒకవేళ శబ్ధాలు వస్తే వాస్తు ప్రకారం కష్టాలు వస్తాయి. అందుకే కిటికీల ఎంపికలో పద్ధతులు పాటించి వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.