
Upasana: అల్లు అర్జున్-రామ్ చరణ్(Allu Arjun) మధ్య మనస్పర్థలు వున్నాయనే ప్రచారం జరుగుతుంది. రామ్ చరణ్ బర్త్ డే సమయంలో జరిగిన కొన్ని పరిణామాలు ప్రస్తావిస్తూ కొందరు అభిప్రాయపడుతున్నారు. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే. అల్లు అర్జున్ సోషల్ మీడియాలో విష్ చేయలేదు. అలాగే అదే రోజు రాత్రి చిరంజీవి నివాసంలో ఏర్పాటు చేసిన పార్టీకి అల్లు అర్జున్ హాజరు కాలేదు. అలాగే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే. రామ్ చరణ్ కొంచెం భిన్నంగా స్పందించారు. బన్నీకి బర్త్ డే విషెస్ చెప్పినప్పటికీ పొడిపొడిగా ముగించారు. ఒక ఫోటో కూడా షేర్ చేయలేదు.
అదే రోజు బర్త్ డే జరుపుకున్న అక్కినేని అఖిల్ కి కూడా రామ్ చరణ్ బర్త్ డే విషెస్ చెప్పారు. అఖిల్ తో దిగిన ఫోటోను రామ్ చరణ్ పోస్ట్ చేశారు. ఇది అల్లు అర్జున్-రామ్ చరణ్(Ram Charan) ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ కి కారణమైంది. అలాగే ఎన్టీఆర్ అల్లు అర్జున్ బర్త్ డే విషెస్ చెప్పాడు. దీనిపై అల్లు అర్జున్ స్పందించారు. ఇద్దరి మధ్య సరదా సంభాషణ సాగింది. రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి రాని హీరోల్లో ఎన్టీఆర్ కూడా ఉన్నారు. చరణ్ తో ఎన్టీఆర్ కి కూడా దూరం పెరిగిందన్న ఊహాగానాలు ఉన్నాయి.
ఈ క్రమంలో ఎన్టీఆర్-అల్లు అర్జున్ బావా… అని సంబధించుకుంటూ సరసాలు ఆడుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్త చర్చకు దారితీసింది. అయితే అల్లు అర్జున్-రామ్ చరణ్ మధ్య విబేధాలు వట్టి అపోహలే. వీరిద్దరూ చాలా క్లోజ్ అని తెలియజేసే సంఘటన తాజాగా చోటు చేసుకుంది. ఉపాసన(Upasana Konidela) తల్లైన సందర్భంగా చిరంజీవి నివాసంలో తరచుగా వేడుకలు జరుగుతున్నాయి. తాజాగా ఉపాసన దంపతులు ఏర్పాటు చేసిన పార్టీకి అల్లు అర్జున్ హాజరయ్యారు.

ఉపాసనతో దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసిన అల్లు అర్జున్… లవ్లీ కామెంట్స్ పోస్ట్ చేశారు. ఉపాసన, రామ్ చరణ్ లను ఉద్దేశిస్తూ అల్లు అర్జున్ చేసిన ప్రేమపూర్వక సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. కాగా జులై నెలలో ఉపాసనకు డెలివరీ కానుందని సమాచారం. రామ్ చరణ్ తన షూటింగ్స్ పోస్ట్ ఫోన్ చేసుకున్నాడట. నాలుగైదు నెలలు ఆయన అన్ని పనులు పక్కన పెట్టి ఉపాసన వెంటే ఉండనున్నాడట. ఉపాసనకు డెలివరీ అయ్యాక శంకర్, బుచ్చిబాబు చిత్రాల గురించి ఆలోచిస్తాడట.