Homeట్రెండింగ్ న్యూస్Newly Married Couple: ట్రోల్‌ ఆఫ్‌ ది డే: కక్కుర్తిలో కమండలం.. వ్యూస్‌ కోసం శోభనం...

Newly Married Couple: ట్రోల్‌ ఆఫ్‌ ది డే: కక్కుర్తిలో కమండలం.. వ్యూస్‌ కోసం శోభనం సోషల్‌ మీడియాలో పెట్టారు.. వైరల్‌ వీడియో !!

Newly Married Couple
Newly Married Couple

Newly Married Couple: సోషల్‌ మీడియా ఇప్పుడు అన్ని మీడియాలకంటే అత్యంత ప్రభావవంతంగా, శక్తివంతంగా మారింది. అయితే ఇందులో మంచి చెడు రెండూ ఉన్నాయి. చాలా వరకు ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా పాలకుల గుప్పిట్లోకి వెళ్లిన ప్రస్తుత తరుణంలో వాస్తవాలు తెలుసుకునేందుకు సోషల్‌మీడియా ప్రత్యామ్నాయ మీడియాగా మారింది. హద్దులు, ఆం„ý లు లేకుండా జరిగింది జరిగినట్లుగా చాలామంది పోస్టు చేస్తున్నారు. ఫలితంగా అధికారం ఉందని విర్రవీగేవారి ఆగడాలు సమాజానికి తెలుస్తున్నాయి. దీంతో రాజకీయా నేతలు కూడా ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా తమ చేతుల్లో ఉన్నప్పటికీ సోషల్‌ మీడియా కోసం ఉద్యోగులను నియమించుకుంటున్నారు. పార్టీలు కూడా సోషల్‌ మీడియా వింగ్‌ ఏర్పాటు చేసుకుంటున్నాయంటే దాని ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే కొంతమంది ఇదే సోషల్‌ మీడియాలు వ్యక్తిగత ఇమేజ్‌ పెంచుకోవడానికి తమ చేస్టలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. సెలబ్రటీలు యాక్టర్లు, యాకంర్లు, టీవీ సీరియల్‌ నటీనటులు మరికొంతమంది డ్యాన్స్, కామెడీ, వ్యవసాయం, ఇన్నోవేషన్స్, ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తున్నారు. కొంతమంది సోషల్‌ మీడియా వ్యూస్, లైక్స్‌ కోసం దిగజారిపోతున్నారు. అశ్లీల వీడియోలు, ఫొటోలు పోస్టు చేస్తున్నారు. ఇప్పుడు సెలబ్రిటీలు కూడా లైక్స్, వ్యూస్‌ కోసం కక్కుర్తి పడుతున్నారు. పర్సనల్‌ ఫొటోలు వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. తాజాగా ఓ సెలబ్రిటీ జంట లైకుల కోసం ఏకంగా శోభనం వీడియోనే సోషల్‌లో పెట్టింది.

Also Read: Valentine Day Movies: ఈ సినిమాలు చూస్తూ లవర్స్ డే చేసుకుంటే కిక్కే వేరు!

వ్యూస్, లైక్స్, షేర్స్‌ జీవితమన్నట్లు..
సోషల్‌ మీడియా విస్తృతంగా వ్యాప్తి చెందడంతో వ్యూస్, లైక్స్, షేర్స్, కామెంట్లే జీవితమైపోయింది. వీటికోసం ఎలాంటి వీడియోలు చేయడానికి అయినా సిద్ధపడుతున్నారు కొంతమంది. దీంతో అనామకులు రాత్రికి రాత్రే సెలబ్రిటీలు కూడా అయిపోతున్నారు. సెలబ్రిటీలు కూడా జీరో అవుతున్నారు. ఇలా లైక్స్‌ కోసం ఓ జంట ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేసిన ఓ వీడియోపై నెటిజట్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

ఫస్ట్‌నైట్‌ వీడియో సోషల్‌ మీడియాలో..
నాలుగు గోడల మధ్య రహస్యంగా.. భార్యాభర్తలకు మాత్రమే ఆనందాన్ని ఇవ్వాల్సిన ఫస్ట్‌నైట్‌ వీడియోను ఓ జంట సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. ఇందులో భార్యాభర్తలిద్దరూ.. శోభనం గదిలో వధూవరుల ఆహార్యంలో కనిపిస్తారు. కెమెరా ముందు ముద్దులతో రెచ్చిపోయి.. హగ్గులతో హాటెక్కిస్తూ రొమాన్స్‌ చేశారు. ఆ తరువాత వధువు ఆభరణాలు, అలంకరణ తీయడంతో వరుడు సాయం చేశాడు. చివరికి ఆమె దుస్తులు తీయబోతుండడంతో వీడియో పూర్తవుతుంది. ‘నిద్రమత్తులో ఉన్న నా భర్త శోభనం రోజు నాకెలా సాయం చేశాడో చూడండి..’ అంటూ ఆమె వీడియోకు కామెంట్‌ కూడా రాసింది.

Newly Married Couple
Newly Married Couple

నెటిజన్ల మండిపాటు..
ఈ వీడియో చూసిన ఫాలోవర్స్, నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. చివరికి దీన్ని కూడా వదల్లేదా.. మీ పిచ్చి తగలెయ్యా.. అని ఒకరంటే.. ఇలాగే ఊరుకుంటే ఫోర్న్‌ వీడియోలు కూడా షేర్‌ చేసేలా ఉన్నారంటూ మరికొంతమంది మండిపడుతున్నారు. ఈ వీడియోకు వారు ‘మా శోభనం రాత్రి మెమెలా గడిపామంటే.. ’అంటూ పెట్టడం అందరికీ మంట పుట్టిస్తోంది. నాలుగు గోడల మధ్య జరగాల్సింది.. నడిబజార్లోకి తెచ్చారంటూ సీరియస్‌ అవుతున్నారు. సోషల్‌ మీడియాలో ఏది పెట్టాలో.. ఏది పెట్టకూడదో.. తెలియదు నేటి యువతకు అంటూ విరుచుకుపడుతున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular