
Valentine Day Movies: ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. జగమంతా ప్రేమమయం అన్నట్లు, నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లవర్స్ తమ ప్రియమైన వారితో వేడుకలు చేసుకుంటారు. మరి లవ్ బర్డ్స్ సెలబ్రేషన్స్ ఈ బ్యూటిఫుల్ లవ్ మూవీస్ చూస్తూ జరుపుకుంటే ఆ కిక్కే వేరు. వాలెంటైన్స్ డే నాడు చూడాల్సిన బెస్ట్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్ ఏమిటో చూద్దాం..
గీతాంజలి:
మణిరత్నం క్రియేటివిటీ నుండి అనేక ప్రేమ కావ్యాలు వెండితెర రూపం దాల్చాయి. ఆయన తెరకెక్కించిన అద్భుతమై ప్రేమకథల్లో గీతాంజలి ఆల్ టైం బెస్ట్ మూవీ. నాగార్జున కెరీర్లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిపోయింది గీతాంజలి చిత్రం.

ఏం మాయచేశావే:
తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ నాగ చైతన్య అద్భుతమైన ప్రేమకథా చిత్రాల్లో నటించారు. ఆయన రెండో చిత్రం ‘ఏం మాయచేశావే’ యువతను ప్రేమసాగరంలో ముంచింది. సమంత హీరోయిన్ గా పరిచయం కాగా, ఆర్ రెహమాన్ తన మ్యూజిక్ తో హృదయాలు కొల్లగొట్టారు.

7/జీ బృందావన కాలనీ:
దర్శకుడు సెల్వ రాఘవన్ 7/జీ బృందావన్ కాలనీ మూవీతో యువత మనసులు దోచేశారు. ఈ చిత్రం అందమైన ట్రాజిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది.

జయం:
దర్శకుడు తేజా ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. చిత్రం, నువ్వు నేను వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. వాటితో పాటు ఆయన తెరకెక్కించిన జయం అద్భుతమైన ప్రేమకథ చిత్రాల్లో ఒకటిగా ఉంది. నితిన్-సదా హీరో హీరోయిన్ గా పరిచయమయ్యారు.

ఆర్య:
అల్లు అర్జున్ కి ఫేమ్ తెచ్చిన మొదటి చిత్రం ఆర్య. దర్శకుడు సుకుమార్ డిఫరెంట్ లవ్ స్టోరీతో ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచారు. ప్రేమించడం అంటే ప్రేమను ఇవ్వడమే, తిరిగి కోరుకోవడం కాదని… ఈ చిత్రంలో చెప్పారు.

ప్రేమదేశం:
దర్శకుడు కథిర్ తెరకెక్కించిన ప్రేమదేశం ట్రైయాంగిల్ లవ్ స్టోరీస్లో ట్రెండ్ సెట్టర్. వినీత్, టబు, అబ్బాస్ నటించిన ప్రేమదేశం ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ తో మరో స్థాయికి వెళ్ళింది. ఈ సినిమాను కొట్టిన ప్రేమకథలు చాలా కాలం రాలేదు.

మనసంతా నువ్వే:
హీరో ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే మైమరపించే లవ్ ఎంటర్టైనర్. రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ కలగలిపి చక్కగా కుదిరిన లవ్ ఎంటర్టైనర్. ఉదయ్ కిరణ్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన చిత్రం ఇది.

ప్రేమిస్తే:
సంధ్య, భరత్ నటించిన ప్రేమిస్తే ట్రాజిక్ లవ్ డ్రామా తెలుగు, తమిళ భాషల్లో విజయం సాధించింది. అప్పట్లో ఈ మూవీ ఓ సంచలనం.

లవ్ స్టోరీ:
శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ మంచి విజయం సాధించింది. నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ మెప్పించే ప్రేమకథా చిత్రాల్లో ఒకటని చెప్పొచ్చు.
