spot_img
Homeట్రెండింగ్ న్యూస్Russian Woman: సవతి కొడుకుతో ప్రేమ.. రోమాన్స్.. భర్తకు షాకిచ్చింది.. తర్వాత ట్విస్ట్!

Russian Woman: సవతి కొడుకుతో ప్రేమ.. రోమాన్స్.. భర్తకు షాకిచ్చింది.. తర్వాత ట్విస్ట్!

Russian Woman: వివాహేతర సంబంధాలు కాపురాలను కూల్చుతున్న సంఘటనలు నిత్యం పదుల సంఖ్యలో చూస్తున్నాం.. ఇవి బయట పడేవి మాత్రమే.. బయట పడకుండా రహస్యంగా కొనసాగేవి అనేకం ఉన్నాయి. పెళ్లినాటి ప్రమాణాలకు కట్టుబడి ఉండాల్సిన భార్య, భర్తలు వాటిని అతిక్రమిస్తున్నారు. వేదమంత్రాల సమక్షంలో అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణాన్ని గట్టున పెడుతున్నారు. కామ వాంఛ, మోహం, వ్యామోహంతో పెళ్లి తర్వాత కూడా పాత సంబంధాలను కొనసాగిస్తున్నవారు కొందరైతే.. కొత్తగా సబంధాలు వెతుక్కుంటున్నవారు మరికొందరు. ఇలాంటి అనైతిక సంబంధాలతో కాపురాలను కూల్చుకుంటున్నారు. ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు. తాజాగా ఇలాంటి అనైతిక సబంధం ఒకటి వెలుగు చూసింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటన రష్యాలో జరిగింది.

45 ఏళ్ల వ్యక్తిని వివాహమాడి..
సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే.. ముక్కున వేలేసుకోకుండా ఉండలేం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన షాక్‌కు గురిచేస్తుంది. రష్యాకి చెందిన అలెక్సీ అనే వ్యక్తి మెుదటి భార్య చనిపోయింది. దాంతో అతడు కొన్ని రోజుల తర్వాత మెరీనా బల్మషేవా అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక అతడు రెండో పెళ్లి చేసుకునే నాటికే అతడికి ఏడేళ్ల కొడుకు వోవా ఉన్నాడు. వీరి కాపురం సజావుగా సాగుతున్న సమయంలో తన సవతి కొడుకు వయసుకొచ్చాడు. అతనిపై మెరీనా కన్ను పడింది. అంతే సవతి కొడుకునే ముగ్గులోకి దించింది. అతడితో ప్రేమాయణం సాగించింది. క్రమంగా వీరి మధ్య బంధం బలపడింది. వోవా తనపై చూపిస్తున్న ప్రేమ మెరీనాకు అర్ధం అయ్యింది. వోవా ప్రేమ తల్లి కొడుకుల బంధం కాదని, అంతకంటే ఎక్కువే అని ఆమె అర్ధం చేసుకుంది.

పెళ్లి చేసుకోవాలని..
ఈ క్రమంలోనే ఇద్దరూ శారీరకంగానూ దగ్గరయ్యారు. ఈ క్రమంలో మెరీనా గర్భం దాల్చింది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటికి వోవా వయసు 20 ఏళ్లు. పెళ్లికి అడ్డుగా ఉన్న భర్తకు మోరీనా విడాకులు ఇచ్చి కొడుకును పెళ్లి చేసుకుంది. తాజాగా వీరికి ఒక కూతురు పుట్టడంతో వీరి జంట మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు కూతుర్లు. అయితే వీరి బంధంపై మెరీనా భర్త అలెక్సీ కోపంతో ఉన్నాడు. తన కొడుకుకు ఏమీ తెలీదని, వాడిని మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుందని అలెక్సీ చెప్పుకొచ్చాడు. ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నా గానీ నేను ఇంత బాధపడే వాడిని కాదు అని కానీ, నా కొడుకును ప్రేమించినందుకు జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మెరీనాకు సపోర్ట్‌ చేస్తే.. మరికొందరు అలెక్స్‌ కు మద్ధతుగా నిలుస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper