Homeబిజినెస్RNR Co Founder Ramya Ravi: బామ్మ బిర్యానీ.. కోట్ల వ్యాపారం..!

RNR Co Founder Ramya Ravi: బామ్మ బిర్యానీ.. కోట్ల వ్యాపారం..!

RNR Co Founder Ramya Ravi: సాధారణంగా బిర్యానీ అంటే మనలో చాలామంది ఇష్టపడతారు. ఇక హైరాబాద్‌ బిర్యానీ అంటే నోరూరుతుంది. దేశంలో అంత్యంత ప్రాముఖ్యత పొందిన బిర్యానీ హైదరాబాద్‌దే. పెరుగుతున్న బిజీ లైఫ్‌లో ఇళ్లలో వంటలు, బిర్యానీలు చేసుకోవడానికి సమయం దొరకడం లేదు. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇస్తే నిమిషాల్లో మన ఇంకి వస్తోంది. పెరుగుతున్న బిర్యానీ వ్యాపారాన్ని పసిగట్టిన ఓ యువతి తన బామ్మ చేసిన బిర్యానీని మార్కెట్‌లోకి తెచ్చింది. విభిన్న రుచులు కోరుకునే ప్రజలు ఈ వెరైటీ బిర్యానికి ఫిదా అయ్యారు. ఇంకేముందు కొనుగోలు దారులకు పసందైన బిర్యానీ అందిస్తూ కోట్లు వెనకుసుకుంటోంది బెంగళూరుకు చెందిన యువతి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఆ బిర్యానీ రుచి వల్లే ఈ స్థాయిలో వ్యాపారం జరుగుతోంది.

దొన్నే బిర్యానీ..
బిర్యానీకి కేరాఫ్‌ అడ్రెస్‌ హైదరాబాద్‌ అని మనందరికీ తెలుసు. కానీ దొన్నె బిర్యానీ అంటే గుర్తుచ్చేది బెంగళూరు. ఈ దొన్నె బిర్యానీతో వ్యాపారం చేస్తూ కోట్లు సంపాదిస్తోంది బెంగళూరుకి చెందిన రమ్య రవి. చిన్నప్పటి నుంచి వ్యాపారంలో రాణించాలనే కోరికతో ఆమె హార్వర్డ్‌ యూనివర్సిటీలో మూడు నెలల మేనేజ్మెంట్‌ కోర్సు కూడా పూర్తిచేసింది. తర్వాత కొన్ని రోజులు తండ్రి దగ్గర వ్యాపార మెలకువలు నేర్చుకుంది.

బామ్మ బిర్యానీని పరిచయం చేసి..
చిన్నప్పుడు తన బామ్మ చేసే దొన్నె బిర్యానీనే ప్రపంచానికి పరిచయం చేయాలని అనుకుంది రమ్య రవి. దీంతో కరోనా సమయంలో రూ.5 లక్షలతో దొన్నె బిర్యానీ వ్యాపారం ప్రారంభించింది. ఒక వంటమనిషితో మొదలుపెట్టిన వ్యాపారం.. ఇప్పుడు రూ.10 కోట్లు టర్నోవర్‌ సాధిస్తోంది. ఒక క్లౌడ్‌ కిచెన్‌ ప్రారంభించి ప్రస్తుతం బెంగళూరు వ్యాప్తంగా 14 కిచెన్లను ఏర్పాటు చేశారు.

తండ్రి, తాత చేయలేకపోయారట..
ఈ దొన్నె బిర్యానీ వ్యాపారాన్ని గతంలో రమ్య రవి తాత, ఆ తర్వాత ఆమె తం్రyì కూడా చేయాలనుకున్నారట. కానీ వారికి సాధ్యం కాలేదు. కరోనా కాలం రమ్య రవికి కలిసి వచ్చింది. ఆర్డర్‌పై బిర్యానీ ఇంటికే పంపడం ప్రారంభించింది. రుచికరమైన బిర్యాని ఇంటికే వస్తుండడంతో క్రమంగా ఆర్డర్లు పెరిగాయి. ఆదాయం భారీగా పెరిగింది. తన తాత, తండ్రి చేయలేకపోయిన దాన్ని రమ్య సాధ్యం చేసింది.

తమిళనాడులో తలపాకట్టు బిర్యానీ..
హైదరాబాద్‌ బిర్యానీ, బెంగళూర్‌ దొన్నె బిర్యానీ తరహాలోనే తమిళనాడులోనూ ప్రత్యేకమైన బిర్యానీ ఉంది. దానిపేరే తలపాకట్టు బిర్యానీ. ఇక్కడ కూడా నేషనల్‌ ఇన్సి్టట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన దీపిక ఫేమస్‌ చేసింది. ఆధునిక మార్కెటింగ్‌ పద్ధతుల ద్వారా బెంగళూరు, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల్లో ఏకంగా 79 బ్రాంచ్‌ లను ఏర్పాటు చేశారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular