Ukraine: యుద్ధం అంటే అదో విషాదం.. అంతులేని ఆవేదన భరితం.. అత్యంత కిరాతక పన్నాగం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం.. యుద్ధం ఎవరు చేసినా అందులో బలి అయ్యేది సామాన్య ప్రజలే. దేశాధినేతలు బాగానే ఉంటారు. కానీ సమిధలుగా మారి ప్రాణాలు కోల్పోయేది పౌరులే. ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పుడు ప్రజల ప్రాణాలు గాలిలో దీపంగా మారాయి. ఎన్నో విషాద గీతికలు అందరినీ కంటతడిపెట్టించాయి. ఉక్రెయిన్ పై యుద్ధాన్ని రష్యా ఆపడం లేదు. తన బాంబుల మోతతో ఆర్థిక మూలాలే కాదు..ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలు తీస్తోంది. వారి ఆస్తులను కూల్చేస్తోంది. ఈ యుద్ధంతో ఉక్రెయిన్ లో ఎన్నో హృదయ విదారక దృశ్యాలు కలిచివేస్తున్నాయి. రష్యాలో యుద్ధంతో తమ వాళ్లను కోల్పోయిన వారి చిత్రాలు, వీడియోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరినీ కంటతపడి పెట్టిస్తున్నాయి.

చిన్నారి ప్రాణాలతో పోరాడుతుంటే తల్లి ఏడుస్తూ చూస్తున్న దృశ్యాలు, రైల్వే స్టేషన్ లో అందరినీ కోల్పోయి ఒంటరైన పసివాడు, బాంబు షెల్టర్లలో కూర్చొని తమ ప్రాణాలు కాపాడుకుంటున్న చిన్నారులు.. బ్రిడ్జి పేలుడులో చిక్కుకున్న చిన్నారిని కాపాడుతున్న సైనికులు ఇలా ఉక్రెయిన్ లో విషాద గాథలు ఎన్నో ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తున్నాయి.
ఇప్పుడు అలాంటి ఒక విషాద గాధ అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ఉక్రెయిన్ లోని మర్హాలిప్క ప్రాంతంలో ఒక ఇంటిపై రష్యా మిసైల్ దాడి చేసింది. దీంతో ఆ కుటుంబంలోని 12 మందిలో 11 మంది దుర్మరణం చెందారు. కేవలం ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో మిగిలాడు. ఈ దాడిలో అతడి పెంపుడు పిల్లి కూడా ప్రాణాలతో బయటపడింది.
ఈ విషాద ఫొటోను తాజాగా ఉక్రెయిన్ విదేశాంగ శాఖ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. కీవ్ లో ఉంటే ప్రాణాలు పోతాయనే భయంతో ఒక వ్యక్తి తన కుటుంబాన్ని తీసుకొని మర్హాలిప్క పారిపోయాడని.. కానీ అక్కడ కూడా వారి ప్రాణాలకు రక్షణ లభించలేదని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ వాపోతూ ఫొటోలు పోస్ట్ చేసింది.
ఆ వ్యక్తి రష్యా బాంబు దాడిలో తన భార్యను, కుమార్తెను, అత్త, చెల్లెలు, అల్లుడు, మనవళ్లు, మేనళ్లుల్లు అందరినీ కోల్పోయి కేవలం పెంపుడు పిల్లితో ఒంటరిగా మిగిలాడని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇంతటి కన్నీటి గాథలు చూసైనా యుద్ధం ఇకనైనా ఆపాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
📍Marhalivka.
This man and his family left Kyiv to be safe. The rocket hit his house, there were 12 people: children (two grandchildren and two nieces), wife, daughter, sister…
Only he and his cat survived.#closeUAskyNOW pic.twitter.com/02cNsfSN4W
— MFA of Ukraine 🇺🇦 (@MFA_Ukraine) March 11, 2022
[…] Lepakshi Temple: మన దేశంలోని ఆలయాలకు సుప్రసిద్ధ చరిత్ర ఉంది. చారిత్రాత్మకమైన ఆనవాళ్లు సైతం కనిపిస్తాయి. ఇందులో అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఆలయం పలు వైవిధ్యభరితమైన కట్టడాలతో అందరిని ఆకర్షిస్తుంది. దీనికి ఉన్న విశిష్టతల గురించి తెలిస్తే ఔరా అనిపిస్తుంది. అనంతపురం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేపాక్షి గ్రామంలోని ఈ ఆలయం గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే అవుతుంది. ఇక్కడ వీరభ్ర స్వామి కొలువై ఉంటాడు. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజులు క్రీ.శ. 16వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. […]