Retro : తమిళ హీరో సూర్య(Suriya Sivakumar) నటించిన లేటెస్ట్ చిత్రం ‘రెట్రో'(Retro Movie) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. టాక్ అయితే ఫ్లాప్ టాక్ వచ్చింది కానీ వసూళ్లు మాత్రం మొదటి వీకెండ్ చాలా డీసెంట్ గా వచ్చాయని చెప్పొచ్చు. ఇది బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా చేస్తుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం కానీ, కచ్చితంగా కంగువా రేంజ్ ఫ్లాప్ మాత్రం అవ్వదు అని చెప్పొచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా 82 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. మొదటి నాలుగు రోజులకు కలిపి ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 36 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు, 73 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.
Also Read : ‘రెట్రో’ కి బ్లాక్ బస్టర్ ఓపెనింగ్..మొదటి రోజు ఎంత వసూళ్లు వస్తాయంటే!
ప్రాంతాల వారీగా చూస్తే తెలుగు వెర్షన్ కనీసం 5 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లేలా ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ద్వారా నిర్మాత నాగవంశీ ఈ చిత్రాన్ని పది కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు. తెలుగు రాష్ట్రాల నుండి మూడు రోజులకు కలిపి ఈ చిత్రానికి మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఫుల్ రన్ లో మరో రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టే అవకాశం ఉన్నది. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే తమిళనాడు లో ఈ చిత్రానికి నాలుగు రోజులకు గాను 35 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈరోజుతో తమిళనాడు లో ‘కంగువా’ మూవీ క్లోజింగ్ వసూళ్లను దాటేయనుంది రెట్రో చిత్రం. కచ్చితంగా క్లోజింగ్ లో తమిళనాడు ప్రాంతం నుండి ఈ చిత్రం 60 కోట్ల రూపాయిల గ్రాస్ ని ఈ వీకెండ్ కి అందుకునే అవకాశం ఉంది.
అదే విధంగా ఓవర్సీస్ లో మొదటి రోజు తర్వాత నిన్ననే ఈ చిత్రం కాస్త వసూళ్ల విషయం లో పుంజుకుంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఓవర్సీస్ లో 17 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక కర్ణాటక లో 9 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కేరళలో 3 కోట్ల 80 లక్షలు, నార్త్ ఇండియా + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి కోటి పది లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 73 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. శనివారం రోజున దాదాపుగా 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఆదివారం రోజున 11 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఫ్లాప్ టాక్ తో ఇంత డీసెంట్ వసూళ్లు ఈమధ్య కాలంలో సూర్య కి రాలేదు.
Also Read : ‘రెట్రో’ కి బ్లాక్ బస్టర్ ఓపెనింగ్..మొదటి రోజు ఎంత వసూళ్లు వస్తాయంటే!