Ram Charan: హైదరాబాద్ జట్టు ఆడుతోంది అంటే తెలుగు అభిమానులు కచ్చితంగా సపోర్ట్ చేస్తారు. కొంతమంది మైదానానికి వచ్చి మ్యాచ్ చూసి.. హైదరాబాద్ ప్లేయర్లకు అండగా ఉంటారు . సన్ రైజర్స్ హైదరాబాద్ జెండాలతో ఆటగాళ్లకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు. ఇలాంటి అభిమానులు సపోర్ట్ సూపర్ గా ఉంది కాబట్టే హైదరాబాద్ జట్టు ఐపీఎల్లో మోస్ట్ ఆడియన్స్ సపోర్టెడ్ టీం జాబితాలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.. గత సీజన్లో హైదరాబాద్ జట్టు ఫైనల్ వెళ్ళిందంటే.. ఇలాంటి స్ట్రాంగ్ ఫ్యాన్ సపోర్ట్ ఉండడం కూడా ఒక కారణం. ఇక హైదరాబాద్ అభిమానుల కోసం.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం రకరకాల కార్యక్రమాలు చేపడుతుంది. మీట్ ది గ్రీట్ పేరుతో అభిమానులకు హైదరాబాద్ ప్లేయర్లను కలుసుకొనే అవకాశం కల్పిస్తూ ఉంటుంది. రకరకాల పోటీలు పెట్టి.. ఆటగాళ్లతో లంచ్ లేదా డిన్నర్ చేసే అవకాశాన్ని కూడా అందిస్తూ ఉంటుంది. ఇక ఫ్యాన్స్ మర్చంటైస్ విషయంలో హైదరాబాద్ జట్టు రకరకాల మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఫాలో అవుతూ ఉంటుంది.
Also Read: ఎంత ట్రోలింగ్ చేస్తే.. అంత ఆదాయం.. అదే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాజిక్కూ!
ఢిల్లీకి రాంచరణ్ సపోర్ట్
సోమవారం ఢిల్లీ జట్టుతో కీలకమైన మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ జట్టు.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ షాక్ ఇచ్చాడు. హైదరాబాద్ కు ప్రత్యర్థిగా బరిలోకి దిగుతున్న ఢిల్లీ జట్టుకు సపోర్ట్ చేశాడు. తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నాడు. ఇటీవల రామ్ చరణ్ తేజ్ నటించిన పెద్ది సినిమాకు సంబంధించి గ్లింప్స్ ఒకటి రిలీజ్ అయింది. అందులో రామ్ చరణ్ తేజ్ డిఫరెంట్ స్టైల్ లో బ్యాట్ తో బంతిని కొడతాడు. అది ఇప్పటికీ సోషల్ మీడియాలో సెన్సేషన్ వ్యూస్ సొంతం చేసుకుంటున్నది. పెద్ద సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో.. హిందీలో కూడా దాని గ్లింప్స్ విడుదల చేశారు. ఇక ఢిల్లీ జట్టు పెద్ది సినిమా కు సంబంధించిన ఆ గ్లింప్స్ ను వాడుకుంది. ఇక ఇటీవల ఢిల్లీ జట్టు గెలిచిన తర్వాత.. ఆ గెలుపు సంబంధించి ఢిల్లీ జట్టు కీలక ఆటగాడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు పెద్ది సినిమాలో రామ్ చరణ్ మాట్లాడిన మాటలకు దగ్గరగా ఉన్నాయి. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పెద్ది గ్లింప్స్ వీడియోను వాడుకుంది. దీనిని పెద్ది గ్లింప్స్ రి క్రియేషన్ గా అభివర్ణించిన రామ్ చరణ్ తేజ్.. ఆల్ ది బెస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ అని పేర్కొని.. హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్ ద్వారా గట్టి కం బ్యాక్ ఇవ్వాలని ఈ వీడియోకు క్యాప్షన్ గా జత చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషనల్ వ్యూస్ సొంతం చేసుకుంటున్నది. కాగా, ఈ వీడియోను ఢిల్లీ జట్టు ఆటగాడు సమీర్ రిజ్వి రి క్రియేట్ చేశాడు. చివర్లో రామ్ చరణ్ ఆడినట్టుగా షాట్ ఆడి అదరగొట్టాడు.
Bas ek hi kaam hai – fight for Dilli pic.twitter.com/KwwpumhE5y
— Delhi Capitals (@DelhiCapitals) May 5, 2025
View this post on Instagram