Teacher Love With Student: విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలు ప్రేమ పాఠాలు వళ్లించింది. ఏకంగా తన స్కూలులోని బాలుడినే తన ప్రేమికుడిగా ఎంచుకుంది. అతడితో తరచుగా ఫోన్ లో మాట్లాడుతూ ప్రేమలో దించింది. రహస్యంగా తీసుకుపోయి గుడిలో వివాహం చేసుకుంది. దీంతో అతడి తల్లిదండ్రులు కంగారు పడ్డారు. తమ బాబు ఎక్కడ అని ఆరా తీశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు రంగంలోకి దిగి విచారించగా అతడి స్కూల్లో పనిచేసే టీచరే అతడిని తీసుకెళ్లినట్లు గుర్తించారు.

దీనిపై నిందితురాలు తల్లిదండ్రులను ఆరా తీయగా నిజమేనని తెలిసింది. తరుచుగా బాలుడితో ఫోన్ లో మాట్లాడేదని వద్దని వారించినా వినేది కాదని చెప్పడం గమనార్హం. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా తురాయూర్ లోని ఓ ప్రైవేటు స్కూల్లో పదకొండో తరగతి చదువుతున్న విద్యార్థి (17) తో సదరు టీచర్ షర్మిల (26) ప్రేమలో పడింది. ప్రేమపాఠాలు వల్లించింది. దీంతో ఆమె అతడి వెంట పడింది. బాలుడైనా తన కోరిక తీర్చుతాడని భావించి లేపుకెళ్లింది.
పోలీసులు షర్మిల ఇంటికి వెళ్లి ఆరా తీశారు. షర్మిల ఫోన్ ట్రాక్ చేయగా వెళాంకిణి, తిరువారూర్, తంజావూర్, తిరుచిరాపల్లి లో సిగ్నల్స్ ట్రేస్ కావడంతో ఎడమలపట్టి పుత్తూర్ లో ఉన్నట్లు గుర్తించి పోలీసులు వారిని పట్టుకున్నారు. తంజావూరులోని ఓ గుడిలో బాలుడిని పెళ్లి చేసుకున్నట్ల ఒప్పుకోవడంతో ఆమెపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విద్యార్థిని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితురాలిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు.

తెలిసీ తెలియని వయసు ఊరించే సొగసు వెరసి బాలుడిని తన బుట్టలో వేసుకుంది. మాయమాటలతో బురిడీ కొట్టించింది. తన వెంట తీసుకుని వెళ్లి సరదాలు తీర్చుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో సదరు టీచర్ పై కేసు నమోదు చేశారు. మైనర్ కావడంతో పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచరే విద్యార్తిని పక్కదారి పట్టించడం కొసమెరుపు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపేందుకు జంకుతున్నారు. వారి భవిష్యత్ ఏమిటనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Pawan Kalyan: అధ్యక్ష అనాల్సిందే.. ఆ రెండింటిపైనే పవన్ కళ్యాణ్ ఫుల్ ఫోకస్