Sunny Leone Pic On TET Hall Ticket: శృంగార తార సన్నీ లియోన్ టీచర్ కావాలి అనుకుంటున్నారు. ఆమె కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కి అప్లై చేశారు. కోట్లు సంపాదిస్తున్న సన్నీ లియోన్ టీచర్ పోస్ట్ కి అప్లై చేయడమేంటి? ఆమెకు అంత అవసరమేంటని? మీకు సందేహం రావచ్చు. మీ అనుమానం నిజమే.. సన్నీ లియోన్ ఎలాంటి టీచర్ పోస్ట్ కి అప్లై చేయలేదు. ఆమె టీచర్ కావాలనుకోవడం లేదు. ఇదంతా అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన గందరగోళం. వివరాలు పరిశీలిస్తే… కర్ణాటక ప్రభుత్వం టీచర్ పోస్ట్స్ కొరకు పోటీ పరీక్షలు నిర్వహిస్తుంది. ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేశారు.

పరీక్షకు హాజరు కావడానికి అవసరమైన హాల్ టికెట్స్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టీచర్ పోస్ట్స్ కి అప్లై చేసిన ఓ మహిళ షాక్ అయ్యారు. తన వివరాల ఆధారంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోగా తన ఫోటో బదులు సన్నీ లియోన్ ఫోటో కనిపించింది. డీటెయిల్స్ మొత్తం అభ్యర్థివే కాగా ఫోటో మాత్రం సన్నీ లియోన్ ది ఉంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది పెద్ద రాజకీయ దుమారానికి కారణమైంది.
ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు బీజేపీ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. అసమర్థ ప్రభుత్వం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీలో నీలి చిత్రాలు చూసే మంత్రులు ఉన్న ప్రభుత్వం నుండి ఇంత కన్నా ఏం ఆశిస్తామంటూ మండిపడుతున్నారు. సన్నీ లియోన్ ఫోటోతో ఉన్న హాల్ టికెట్ వైరల్ గా మారింది. ఇక ప్రజలు సైతం అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రస్థాయిలో తప్పుబడుతున్నారు. మహిళా అభ్యర్థి ఫోటో స్థానంలో సన్నీ లియోన్ ఫోటో ఎలా పెడతారు. ఆ మాత్రం తేడా తెలియడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. అధికారులు కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని దుయ్యబడుతున్నారు.

ఈ న్యూస్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇక సన్నీ లియోన్ పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవల సన్నీ లియోన్ హీరోయిన్ గా నటించిన జిన్నా విడుదలైంది. మంచు విష్ణు హీరోగా హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న జిన్నా కమర్షియల్ గా ఆడలేదు. గతంలో సన్నీ లియోన్ కరెంటు తీగ మూవీలో నటించారు. గరుడ వేగ మూవీలో ఐటెం సాంగ్ చేశారు.