Shiva Jyothi , Anvesh
Shiva Jyothi and Anvesh : బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేశారని పలువురు సోషల్ మీడియా ఇన్ ఫ్లూ యన్సర్స్ పై తెలంగాణ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో కొంతమంది విచారణకు హాజరయ్యారు.. మరి కొంతమంది విదేశాలకు వెళ్లిపోయారు. విచారణకు హాజరైన వారి స్టేట్మెంట్లను పోలీసులు రికార్డు చేసుకున్నారు.. సోషల్ మీడియా ఇన్ ఫ్లూ యన్సర్స్ చాలామంది తమ బెట్టింగ్ యాప్స్ కు అనవసరంగా ప్రమోషన్ చేసామని.. అందులో ఉన్న అసలు విషయాలు మాకు తెలియవని పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసిన వారిపై తెలంగాణ పోలీసుల కంటే ముందు సోషల్ మీడియా ఇన్ ఫ్లూ యన్సర్, టూరిస్ట్ వ్లాగర్ నా అన్వేషణ అన్వేష్ (na anveshana anvesh) ఒక యుద్ధమే ప్రకటించాడు. బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ ఫ్లూ యన్సర్స్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. ఆ మధ్య తెలంగాణ ప్రాంతానికి చెందిన భయ్యా సన్నీ యాదవ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన నా అన్వేషణ అన్వేష్.. సినీ కమెడియన్ అలీని కూడా వదలలేదు. అలీపై నా అన్వేషణ అన్వేష్ తీవ్రస్థాయిల విమర్శలు చేశాడు. వందల సినిమాలు చేసిన వ్యక్తి డబ్బుల కోసం కక్కుర్తి పడి ఇలాంటి యాప్స్ కు ప్రమోషన్ చేయడం ఏంటని మండిపడ్డాడు. ఇప్పుడు తాజాగా ఒకప్పటి టీవీ యాంకర్.. తీన్మార్ వార్తలు తో ప్రాచుర్యం పొందిన సావిత్రి అలియాస్ శివ జ్యోతి పై విమర్శలు చేయడం మొదలుపెట్టాడు..
Also Read : కంటతడి పెట్టుకున్న శివజ్యోతి.. కారణం అదే..
అందువల్లే అన్ని ఆస్తులు..
సావిత్రి అలియాస్ శివ జ్యోతి ఒకప్పుడు ఓ చానల్లో తీన్మార్ వార్తలకు ప్రజెంటర్ గా వ్యవహరించేది.. ఆ తర్వాత కొంతకాలానికి మరో ప్రముఖ ఛానల్లోకి వెళ్లిపోయింది. అనంతరం ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ వచ్చింది. బిగ్ బాస్ టీవీ షోలో కూడా పాల్గొంది. రీచ్ పెరగడంతో సోషల్ మీడియాలో కూడా విపరీతమైన హైప్ వచ్చింది. సొంతంగా వీడియోలు చేయడం మొదలుపెట్టింది. భర్త గంగూలితో కలిసి ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వీడియోలను వ్లాగ్ రూపంలో తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయడం మొదలుపెట్టింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అలియాస్ బిఆర్ఎస్ కు అనుకూలంగా ప్రచారం చేసింది. గులాబీల జెండాలమ్మ అనే పాటకు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే శివ జ్యోతి ఆ మధ్య కొన్ని బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసింది. అయితే వాటినే ఇప్పుడు నా అన్వేషణ అన్వేష్ ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేయడం వల్లే శివ జ్యోతి భారీగా సంపాదించారని.. హైదరాబాదులో ఖరీదైన ప్లాట్ ఉందని.. మహ బూబ్ నగర్ జిల్లాలో హైవే పక్కన భూమి కూడా కొనుగోలు చేశారని.. నా అన్వేషణ అన్వేష తన వీడియోలో ఆరోపించాడు.. అయితే నా అన్వేషణ అన్వేష్ చేసిన వ్యాఖ్యలను కొంతమంది సమర్థిస్తుండగా.. మరి కొంతమంది విమర్శిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రభుత్వం నిషేధిస్తే.. సోషల్ మీడియా ఇన్ ఫ్లూ యన్సర్స్ ఎందుకు ప్రచారం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ముందుగా ప్రభుత్వాన్ని నిలదీయాలని.. ఆ తర్వాతే సోషల్ మీడియా ఇన్ ఫ్లూ యన్సర్స్ జోలికి రావాలని సూచిస్తున్నారు. ” వారేం అన్యాయం చేయలేదు. ఇంకొకరిని మోసం చేయలేదు. తమకు ఉన్న పాపులారిటీ కి తగ్గట్టుగానే మాట్లాడారు. బెట్టింగ్ లో పాల్గొనాలని.. డబ్బు ఇందులో పెట్టాలని చెప్పలేదు కదా అని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : మీకో దండంరా బాబు.. మీరంతా నన్ను తల్లిని చేస్తున్నారు !