https://oktelugu.com/

Anchor Shiva Jyothi: మీకో దండంరా బాబు.. మీరంతా నన్ను తల్లిని చేస్తున్నారు !

Anchor Shiva Jyothi: ‘మీకో పెద్ద దండంరా బాబు. అనవసరంగా మీరంతా నన్ను తల్లిని చేస్తున్నారు’ అంటూ యాంకర్ శివజ్యోతి మీడియా పై విరుచుకు పడింది. ఏ మీడియా ద్వారా అయితే తాను ఎదిగిందో.. ఇప్పుడు అదే మీడియాతో ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాను అని శివజ్యోతి ఎమోషనల్ అయ్యింది. అసలు ఇంతకీ ఏమి జరిగిందో డిటైల్డ్ గా తెలుసుకుందాం. శివజ్యోతి గర్భవతి అని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పైగా, ఫోటోషాప్ […]

Written By:
  • Shiva
  • , Updated On : April 20, 2022 / 11:35 AM IST
    Follow us on

    Anchor Shiva Jyothi: ‘మీకో పెద్ద దండంరా బాబు. అనవసరంగా మీరంతా నన్ను తల్లిని చేస్తున్నారు’ అంటూ యాంకర్ శివజ్యోతి మీడియా పై విరుచుకు పడింది. ఏ మీడియా ద్వారా అయితే తాను ఎదిగిందో.. ఇప్పుడు అదే మీడియాతో ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాను అని శివజ్యోతి ఎమోషనల్ అయ్యింది. అసలు ఇంతకీ ఏమి జరిగిందో డిటైల్డ్ గా తెలుసుకుందాం.

    Anchor Shiva Jyothi

    శివజ్యోతి గర్భవతి అని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పైగా, ఫోటోషాప్ లో శివజ్యోతి బేబీ బంప్ ను క్రియేట్ చేసి మరీ.. ఆమె గర్భవతి అని క్రియేట్ చేశారు గాసిప్ రాయుళ్లు. ఈ పుకార్లు చూసి ఆమె కోపంతో ఊగిపోయింది. “నేను ప్రెగ్నెంట్‌ అంటూ ఫేక్‌న్యూస్‌ సృష్టిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు థంబ్‌ నైల్స్‌ వేసేస్తున్నారు. ఏమైనా ఉంటే నేనే చెప్తాను’ అంటూ ఆమె ఒక వీడియో పోస్ట్ చేసింది.

    Also Read: Dil Raju: ట్రెండింగ్ లోకి ‘దిల్ రాజు’ భార్య.. ఆ పిక్ వల్లే !

    నిజానికి శివజ్యోతికి పెళ్లయి చాలా ఏళ్ళు అయింది. ఐతే, ఆమెకు ఇంకా పిల్లలు కలగలేదు. ఇదే విషయం గురించి ఆమె ఇన్ డైరెక్ట్ గా మాట్లాడుతూ..“నా జీవితంలో ఇది చాలా పెద్ద విషయంరా బాబు. నా లైఫ్‌ లో నిజంగా ఇలాంటి గుడ్‌ న్యూస్‌ ఉంటే.. నేనే మీ అందరితో చెబుతాను. మీ అందరికీ దండం. ఇలాంటి వార్తలు పుట్టించొద్దు’ అని శివజ్యోతి తన వీడియోలో వేడుకుంది .

    Anchor Shiva Jyothi

    “ఇస్మార్ట్ న్యూస్”, అంతకుముందు “తీన్మార్”న్యూస్ తో యాంకర్ గా శివజ్యోతి బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ‘బిగ్ బాస్ 3’ షోతో సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అయినా, తల్లి అవ్వాలనే కోరిక పెళ్లైన ప్రతి యువతిలోనూ ఉంటుంది. నటీనటులు, యాంకర్లు కూడా అందుకు అతీతులు కారు. అయితే, తల్లి కాకుండానే కొంతమంది గాసిప్ రాయుళ్లు వాళ్ళను తల్లిని చేస్తుండటం హర్షించదగ్గ విషయం కాదు.

    అసలు ఏ అమ్మాయి అయినా తాను త‌ల్లి అయ్యే సందర్భం వస్తే.. ఎంతో ఆనంద‌ప‌డుతుంది. జీవితంలో అంత‌కంటే మ‌ధుర క్ష‌ణాలు స్త్రీ జీవితంలో ఉండ‌వు కాబట్టి.. బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చే రోజు కోసం ఎంతగానో పరితపిస్తోంది. కానీ తనకు గర్భం అని, త్వరలో తల్లి కాబోతున్నాని పేపర్లో.. సోషల్ మీడియాలో చూసి తెలుసుకుంటే అది దరిద్రంగా ఉంటుంది. ప్రస్తుతం శివజ్యోతి పరిస్థితి ఇలాగే తయారైంది.

     

     

     

     

     

     

     

     

    Recommended Videos:

    Tags