Bangladesh vs Pakistan ODI Series 2026 Result: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో పాకిస్థాన్ ది నాలుగో ర్యాంకు. ఆ జట్టులో మెరుగైన ప్లేయర్లు ఉన్నారు. కానీ, ఏం లాభం.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో పదో ర్యాంకులో ఉన్న బంగ్లా దేశ్ ముందు తలవంచారు. ఇప్పటికే తీవ్ర విమర్శల పాలవుతున్న తమ ఆటతీరుతో సతమతవుతున్న పాకిస్థాన్ క్రికెటర్లు .. అత్యంత నిరాశజనకమైన ఆటతీరుతో మరింత దారుణంగా పరువు తీసుకున్నారు.
బంగ్లాదేశ్ తో జరుగుతున్నమూడు వన్డేల సిరీస్ ను పాకిస్థాన్ కోల్పోయింది. తొలి మ్యాచ్ లో ఓటమి పాలైన పాకిస్థాన్.. ఆ తర్వాత తేరుకుంది. రెండో మ్యాచ్ లో విజయం సాధించింది. దీంతో పాకిస్థాన్ గాడిలో పడినట్టేనని అందరూ అనుకున్నారు. కానీ, ఆ జట్టు ఎప్పటిలాగానే దారుణమైన ఆటతీరుతో నిరాశపరిచింది. పేలమైన బౌలింగ్, కీలక దశలో వికెట్లు కోల్పోయి ఓటమిని కొని తెచ్చుకుంది. దీంతో పాకిస్థాన్ పరువు సింధూ నదిలో కలిసిపోయింది.
సిరీస్ భవితవ్యాన్ని తేల్చే మూడో వన్డే ఆదివారం జరిగింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఓపెనర్లు సైఫ్ హసన్(36), తంజిద్ హసన్ తమీమ్(107), లిట్టన్ దాస్(41), తోహిద్ హ్రుదయ్(48) పరుగులు చేశారు. ఓపెనర్లు సైఫ్ హసన్, తంజిద్ హసన్ తమీమ్ తొలి వికెట్ కు 105పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఓపెనర్లు అందించిన బలమైన పునాదిని బంగ్లా బ్యాటర్లు సమర్థవంతంగా వినియోగించుకున్నారు. రెండో వికెట్ కు 53, మూడో వికెట్ కు 36, నాలుగో వికెట్ కు 68 పరుగుల భాగస్వామ్యాలను నమోదు చేసిన నేపథ్యంలో బంగ్లా ఏకంగా 290 పరుగులు చేసింది.
291 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 279 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్లు ఫర్హాన్(6), మాజ్ సదఖత్(6)దారుణంగా ఆడారు. ఘాజీ ఘోరీ(29), మహ్మద్ రిజ్వాన్ (4), అబ్దుల్ సమద్(34), సల్మాన్ ఆఘా(106), సాద్ మసూద్(38), షాహిన్ అఫ్రిదీ(37) పరుగులు చేశారు.
బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ముస్తాఫిజుర్ రెహమాన్ మూడు వికెట్లు సాధించాడు. నహీద్ రాణా రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు. రిషాద్ హొస్సేన్ ఒక వికెట్ పడగొట్టాడు.
BIGGEST HUMILIATION FOR PAKISTAN IN BANGLADESH
Bangladesh beat Pakistan in 3rd ODIs by 11 runs. Also Bangladesh won the series 2-1
Next level humiliation for Pakistan after T20 World Cup super 8 exit today Bangladesh cooked badly to Porkistan pic.twitter.com/Sv4vYCJTS6
— Cricket Central (@CricketCentrl) March 15, 2026