Bigg Boss Shiva Jyothi
Bigg Boss Shiva Jyothi: న్యూస్ యాంకర్ గా అడుగుపెట్టిన వాళ్లు అదే ఫార్మాట్ లో వెళ్తుంటారు. కానీ యాంకర్ శివజ్యోతి మాత్రం ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లలో దూసుకుపోతుంది. తెలంగాణ యాసలో తన మాటలను తుటాల్లా పేలుస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. యూట్యూబ్ చానెళ్లలోనూ స్టార్ నటిగా పేరు తెచ్చుకున్న ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగుపెట్టింది. అయితే ఆ తరువాత పలు కామెడీ షోల్లో నటిస్తూ సొంతంగా యూట్యూబ్ ఛానెల్ కూడా పెట్టింది. తాజాగా ఇందులో ఓ వీడియోతో శివజ్యోతి అలరిస్తోంది. తాను కొత్తగా కొనుక్కున్న ఇంటి గురించి చెబుతూ.. చివరికి కంటతడి పెట్టుకుంది. అయితే శివజ్యోతి కన్నీళ్లు పెట్టడానికి కారణమేంటంటే?
ఓ న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా అలరించిన శివజ్యోతి.. ఆ తరువాత వెంటనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత బయటకొచ్చిన ఈమె మరో న్యూస్ ఛానెల్ లో కామెడీ వార్తలు చెప్పింది. కానీ ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లలో ఎంట్రీ ఇచ్చి మిగతా వారికి పోటీనిస్తోంది. ఆడుతూ.. పాడుతూ.. అందరినీ అలరిస్తూ హీరోయిన్ రేంజ్ లో అందంగా తయారైంది. స్పెషల్ ఈవెంట్లలోనూ తన దైన యాంకరింగ్ తో ఆకట్టుకుంటోంది.
అయితే గతంలో ‘జ్యోతక్క’ పేరుతో శివజ్యోతి సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టింది. ఇందులో పలు వీడియోలు చేస్తూ అలరిస్తోంది. తాజాగా తన‘హోం టూర్’ పేరుతో ఓ వీడియో పోస్టు చేసింది. ఈ సందర్భంగా ఆ ఇల్లు కొన్న విషయాన్ని బయటపెట్టింది. ‘2019లో మణికొండలో మేం ఇల్లును కొనుక్కున్నాం. 2020 ఫిబ్రవరిలో గృహ ప్రవేశం చేశాం. అ తరువాత నెలరోజులకే లాక్ డౌన్ వచ్చింది. అయినా కొద్దిరోజులకే ఇక్కడికి షిప్ట్ అయ్యాం .’ అని చెప్పుకొచ్చింది.
‘ఇవన్నీ నాకు వచ్చిన అవార్డులు.. ఈ ఇంటిని ఎంతో ఇష్టంగా ఇంటీరియర్ డిజైన్ చేసుకున్నాం. లాక్ డౌన్ తరువాత రూ.2 లక్షల అప్పు తీసుకొని దీనిని కొనాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో ఈఎంలు ఎలా కట్టాలో అర్థం కాలేదు.అయినా ఇష్టపడి కొకున్కున్నాం.. ఇందులోకి వచ్చిన తరువాతే ఎంత్ లక్ వచ్చింది. కొత్త న్యూస్ ఛానెల్ పెట్టాను. కానీ అందులో వ్యూస్ రావడం లేదు. అయితే మీకో షాకింగ్ విషయమేంటంటే.,. ఈ ఇంటిని అమ్మేయబోతున్నాం.. ’ అని షాక్ ఇచ్చింది. ‘ఎందుకంటే మేం ఇంకో ఇంటిని కొనుగోలు చేశారు. రెండు ఇళ్ల ఈఎంఐలు కట్టలేకపోతున్నాం.. అందువల్ల దీనిని అమ్మేయాలని నిర్ణయించుకున్నాం..’అంటూ ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకుంది శివజ్యోతి.