https://oktelugu.com/

Shreyas Talpade : తక్కువ సమయంలో రెట్టింపు లాభం ఆశ చూపిన నటుడు.. చివరకు చీటింగ్‌!

Shreyas Talpade : మోసపోయేవాళ్లు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్లు ఉంటారు. ప్రస్తుతం సైబర్‌ మోసాలతోపాటు అధిక వడ్డీ, రెట్టింపు ఆదాయం అంటూ అనేక మోసాలు సమాజంలో జరుగుతున్నాయి. తాజాగా ఓ నటుడే ఇలాంటి మోసానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది.

Written By: , Updated On : March 31, 2025 / 12:13 PM IST
Bollywood Actor Shreyas Talpade

Bollywood Actor Shreyas Talpade

Follow us on

Shreyas Talpade : ఉత్తర్‌ ప్రదేశ్‌(Uttara Pradesh)లోని మహోబా జిల్లాలో జరిగిన ఓ ఆర్థిక మోసం కేసు స్థానికులను కలవరపెట్టింది. ఒక సహకార సంఘం చిట్‌ ఫండ్‌ కంపెనీ పేరుతో గ్రామస్తుల నుంచి వందల కోట్ల రూపాయలను వసూలు చేసి, అనంతరం పరారైంది. ‘తక్కువ సమయంలో డబ్బును రెట్టింపు చేస్తాం‘ అనే ఆకర్షణీయమైన హామీతో ఈ కంపెనీ జనాలను ఆకర్షించింది. ఈ ఆశతో గ్రామస్తులు తమ జీవనోపాధి కోసం సేవ్‌ చేసిన డబ్బును భారీగా డిపాజిట్‌(Dipajit) చేశారు. అయితే, కంపెనీ హఠాత్తుగా చేతులెత్తేసి జిల్లా నుంచి తప్పించుకోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. మోసపోయిన వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

Also Read : ఆలీ దంపతులు మోసం చేశారు, బెట్టింగ్ యాప్స్ వివాదంలో స్టార్ కమెడియన్… యూట్యూబర్ అన్వేష్ సెన్సేషనల్ కామెంట్స్

నటుడిపై కేసు..
పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించి, బాలీవుడ్‌ నటుడు(Bollywood Actar) శ్రేయాస్‌ తల్పాడేతో పాటు మరో 14 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కంపెనీ గ్రామస్తుల నుంచి సేకరించిన సొమ్మును దుర్వినియోగం చేసి, మోసపూరితంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను శ్రేయాస్‌ తల్పాడే(Shreyash tadpade) తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, తనకు ఈ కుంభకోణంతో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ‘ఇతర సినీ తారల మాదిరిగానే నాకు కూడా వివిధ కార్యక్రమాలకు ఆహ్వానాలు వస్తుంటాయి. వీలైనప్పుడు అలాంటి వేడుకలకు హాజరవుతాను. ఈ కంపెనీ కార్యక్రమానికి కూడా అదే విధంగా వెళ్లాను, కానీ దానికి మించి నాకు ఎలాంటి లింక్‌ లేదు‘ అని ఆయన వివరణ ఇచ్చారు.

స్థానికుల ఆగ్రహం..
ఈ ఘటన స్థానికుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. తమ కష్టార్జితాన్ని కాపాడుకోవడానికి బదులు, మోసపూరిత హామీలకు లొంగిపోయినందుకు వారు పశ్చాత్తాపపడుతున్నారు. పోలీసులు(Police)ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. శ్రేయాస్‌ తల్పాడే హిందీ, మరాఠీ సినిమాల్లో సహజ నటనతో ప్రేక్షకులను అలరించిన నటుడు. ఇటీవల ‘పుష్ప 2‘ హిందీ వెర్షన్‌లో అల్లు అర్జున్‌(Allu Arjun) పాత్రకు డబ్బింగ్‌ చెప్పి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే, ఈ కేసు ఆయన ఇమేజ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ ఘటన మరోసారి చిట్‌ ఫండ్‌ కంపెనీలపై ప్రజల్లో అపనమ్మకాన్ని పెంచింది.

Also Read : ఆపరేషన్‌ బ్రహ్మ.. మయన్మార్ కు భారత్‌ ఆపన్నహస్తం..