spot_img
HomeతెలంగాణPreethi Reddy Political Entry: మల్లారెడ్డి కోడలు.. పెద్ద స్కెచ్చే వేసిందిగా..

Preethi Reddy Political Entry: మల్లారెడ్డి కోడలు.. పెద్ద స్కెచ్చే వేసిందిగా..

Preethi Reddy Political Entry: పూలమ్మిన.. పాలమ్మిన.. ఈ డైలాగ్‌ చెప్పగానే గుర్తొచ్చే పేరు.. మల్లారెడ్డి. టీడీపీలో రాజకీయం మొదలు పెట్టి.. బీఆర్‌ఎస్‌లో చేరిన చేమకూర మల్లారెడ్డి వ్యాపారంలోనూ, ఇటు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. మోటివేటర్‌గా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన స్ఫూర్తితో వ్యాపారంలో రాణిస్తున్నారు మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి. మల్లారెడ్డి వారసురాలిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న ప్రీతిరెడ్డి.. రాజకీయ వారసత్వాన్ని పునికిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రీతిరెడ్డి రాజకీయ ప్రవేశం గురించి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.

Also Read: ‘ధురంధర్ 2’ తో పోటీ పడడం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీం చేసిన పెద్ద మిస్టేక్.. ఓవర్సీస్ లో చావు దెబ్బ!

ప్రీతి రెడ్డి ప్రస్తుత పాత్ర..
మల్లారెడ్డి విద్యా సామ్రాజ్యంలో కీలకంగా పనిచేస్తున్న ప్రీతి రెడ్డి ఇటీవల సోషల్‌ మీడియా ద్వారా ఎలివేట్‌ అయ్యారు. ఈ సమావేశాల్లో ఆమె విద్యా మౌలిక సదుపాయాలు, ప్రాంతీయ అభివృద్ధి విషయాలతోపాటు ఆర్థిక అసమానతలు, దారిద్య్ర నిర్మూలన, స్త్రీల ఆర్థిక స్వాతంత్య్రం, యువతకు అవకాశాలు వంటి విస్తృత అంశాలపై చర్చించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా, ఉపాధి అవకాశాలు పెంచాలని, సామాజిక న్యాయం అందించాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఆమెను సామాన్యుల సమస్యలకు సున్నితంగా ఉన్న నాయకురాలిగా చిత్రీకరిస్తున్నాయి.

బీజేపీ వైపు చూపు..
ప్రీతి రెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలను మెచ్చుకున్నారు. ముఖ్యంగా, కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ 2020) ద్వారా విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు, ఆర్థిక సంస్కరణలు, మహిళా సాధికారత కార్యక్రమాలు గురించి ఆమె ప్రశంసలు ఆకట్టుకున్నాయి. బీజేపీ పాలనలో దేశవ్యాప్త అభివృద్ధి, డిజిటల్‌ ఇండియా వంటి కార్యక్రమాలను ఆమె సమర్థించడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌కు బదులు జాతీయ పార్టీతో ఆమె భవిష్యత్తు లింక్‌ను సూచిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

స్పందించని మల్లారెడ్డి కుటుంబం..
ప్రీతిరెడ్డి రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న ఊహాగానాలపై మల్లారెడ్డి కుటుంబం స్పందించలేదు. ప్రతీరెడ్డి వ్యాఖ్యలను ఖండించలేదు. మల్లారెడ్డి కుటుంబం ఇప్పటికే తెలంగాణలో బలమైన రాజకీయ, విద్యా ప్రభావం కలిగి ఉంది. ప్రీతి రెడ్డి ప్రవేశం కుటుంబ ప్రభావాన్ని మరింత బలోపేతం చేస్తుందని అంచనా. రాబోయే స్థానిక ఎన్నికలు లేదా అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమె అధికారిక ప్రవేశం జరిగే అవకాశం ఎక్కువ.

ప్రీతిరెడ్డి రాజకీయ ప్రవేశం తెలంగాణలో కుటుంబ రాజకీయాలకు కొత్త డైమెన్షన్‌ ఇస్తుంది. బీఆర్‌ఎస్‌లోనే చేరినా, ఆమె జాతీయ విధానాల పట్ల ఆకర్షణ బీజేపీతో కూటమి ఏర్పడే సూచనలు ఉన్నాయి. తెలంగాణలో బీజేపీ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో, ఆమె ప్రవేశం పార్టీకి కొత్త యువ, మహిళా ముఖాన్ని ఇస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version