Homeఆధ్యాత్మికంToday 16 March 2026 Horoscope: ఈ రాష్ట్ర ఉద్యోగులు ఈరోజు జాగ్రత్త..

Today 16 March 2026 Horoscope: ఈ రాష్ట్ర ఉద్యోగులు ఈరోజు జాగ్రత్త..

Today 16 March 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై ధనిష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో ఈరోజు ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడతారు. అయితే కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం…

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. కెరీర్ విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారాలు ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఖర్చులు పెరిగే అవకాశం. అనవసరపు వస్తువులను కొనుగోలు చేయకుండా ఉండాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉంటుంది. దీంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేముందు పెద్దలను సంప్రదించడం మంచిది. ఒప్పందాలు చేసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అధికారులు మద్దతు ఉంటుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు కార్యాలయాల్లో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. అయితే ముఖ్యమైన ప్రాజెక్టులు పూర్తి చేయడంలో జాగ్రత్తగా ఉండాలి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అప్పులను తీరుస్తారు.
.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈ రోజు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు వాదనలు చేయకుండా ఉండాలి. కొత్తగా వ్యాపారం చేయాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. అప్పులను తిరిగి చెల్లించడంలో విజయం సాధిస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడతాయి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేయాలి. వ్యాపారాలు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. వీటిని పూర్తి చేయడానికి తోటి వారి సహకారం తీసుకుంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఆస్తికి సంబంధించిన విషయంలో శుభవార్తలు వింటారు. అప్పులను తీర్చడంలో విజయం సాధిస్తారు. సాయంత్రం కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు మెరుగైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో సమయానికి ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని రిస్క్ తో కూడిన పనులను పూర్తి చేస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వ్యాపారులు ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో తోటి వారి మద్దతు ఉండడంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు పిల్లల విషయంలో శ్రద్ధ చూపుతారు. ఒకేసారి చాలా పనులు చేయడం వల్ల ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. వివాహ కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్తగా పెట్టుబడులు పెడతారు. బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. అయితే తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు కొత్తగా పెట్టుబడులు పెడతారు. వ్యాపారులకు అనుకూలమైన వాతావరణ ఉండడంతో గతంలో కంటే ఇప్పుడు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం పెరుగుతుంది. అనవసరమైన ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version