Pakistani Girl Married Father: మా నాన్నకు పెళ్లి… పాతికేళ్ల క్రితం వచ్చిన సినిమా ఇది. ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఈ సినిమా అప్పటల్లో చర్చనీయాంశమైంది. పెళ్లయి భార్య చనిపోయిన భర్త తన పిల్లల కోసం చేసిన త్యాగం గుర్తించి తిరిగి తండ్రికి పెళ్లి చేయడం కథాంశంగా సినిమా తెరకెక్కించారు. దీంతో ఆ తర్వాత తండ్రులకు పిల్లలు పెళ్లి చేయడం పెరిగాయి. తల్లులకు కూడా పెళ్లి చేసిన సంఘటనలు ఉన్నాయి. తండ్రికి సమాజంలో ప్రత్యేక స్థానం ఉంది. పశువులు మినహా పిల్లలను ఏ తండ్రి కూడా వేరేరకంగా చూడడు. పిల్లల కోసం తన బాధను దిగమింగుకునే వ్యక్తిత్వం తండ్రిది. రాత్రి పిల్లలు హాయిగా నిద్రపోతుంటే.. మరుసటి రోజు పిల్లలకు ఏం చేయాలని రాత్రి ఆలోచించే వ్యక్తి తండ్రి. ఎంతో ఉన్నతమైన తండ్రి స్థానానికే మచ్చ తెచ్చారు ఆ తండ్రీకూతుళ్లు. సభ్య సమాజం తల దించుకునేలా.. సభ్య సమాజం సిగ్గుపడేలా పశువుల తరహాలో.. వావి వరసలు మరిచి మానవత్వాన్ని మంటగలిపారు.
తండ్రినే పెళ్లాడిన కూతురు..
సాధారణంగా తండ్రి కూతురు బంధం ఎంత ప్రత్యేకమైనదో చెప్పాల్సిన పనిలేదు. కూతురులో తన తల్లిని చూసుకుంటాడు తండ్రి. కూతురు తన తండ్రి తన మొదటి సూపర్ హీరో అని భావిస్తూ ఉంటుంది. అయితే కొడుక్కి ఏదైనా కష్టం వచ్చినా చూసి చూడనట్టు ఉంటాడేమో.. కానీ కూతురికి ఏదైనా కష్టం వస్తే గంభీరంగా ఉండే తండ్రి సైతం తల్లడిల్లిపోతూ ఉంటాడు. కానీ, ఓ తండ్రి, కూతురు ఆ బంధానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించారు. పాకిస్థాన్‌లో రబియా అనే యువతి తన సొంత తండ్రిని పెళ్లి చేసుకుంది.
పేరును సార్థకం చేసుకునేందు అట..
దీనిపై ప్రశ్నిస్తే ఆమె చెప్పిన సమాధానం విన్నవారందరూ షాక్ అవుతున్నారు. ‘నాలుగవ సంతానానికి రబియా అనే పేరు పెడతారని విన్నాను. కానీ నేను నా పేరెంట్స్‌కి రెండో సంతానాన్నే.. నా పేరుకు న్యాయం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్న.. నా తండ్రికి ఇది నాలుగో పెళ్లి.. ఆయనకు నాలుగో భార్య గా ఉండడం వల్ల నా పేరుకు జస్టిఫికేషన్ లభిస్తుంది’ అని తెలిపింది రబియా. పశువులు కూడా పిల్లలపై ప్రేమ చూపుతుంటే పాకిస్థాన్‌లో మాత్రం ఇలా హీనంగా తయారవడం చర్చనీయాంశమైంది.
నెటిజన్ల ఆగ్రహం..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తండ్రి కూతురు పెళ్లిపై నెటిజన్లు మండి పడుతున్నారు. పేరు కోసం పెళ్లి చేసుకోవడం ఏంటి.. ఇంతకంటే చచ్చిపోయినా బాగేండేది.. ఇప్పటికే వాడు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఇంకా కామంతో ఉంటే వేరే మహిళ దొరకలేదా.. కూతురును పెళ్లాడడం ఏంటిరా కుక్క.. మీరు మనుషులా.. పశువులా అంటూ ఆగ్రహంతో కామెంట్స్ పెడుతున్నారు. ఎంతైనా పాకిస్థాన్ కదా.. అలాగే ఉంటదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.