Mobile Phones Uses: ఉరుకుల పరుగుల జీవితం, ఇంట్లో పనులు, పిల్లలు వాళ్ల హోంవర్కులు, వీటన్నింటి తోటి బయటకి వెళ్లి యాక్టివ్ సోషల్ లైఫ్ గడిపే అవకాశం ఈ మధ్యకాలంలో బాగా తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో సెల్‌ఫోన్ మన బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. ఉత్తరాల బదులు ఈ మెయిల్స్, ముఖాముఖి సంభాషణల బదులు ఫోన్ కాల్స్ వచ్చేసిన రోజుల్లో, నేను టెక్నాలజీ వాడను అని మడికట్టుకుని ఉండే పరిస్థితి లేదు. ఇక కరోనా సమయంలో ఆన్‌లైన్ తరగతులు, ఇళ్లలోనే గడపాల్పిన పరిస్థితుల కారణంగా పిల్లలు ఫోన్‌కు ఎక్కువగా అడిక్ట్ అయ్యారు… అవుతున్నారు. అతిగా ఫోన్ వాడకం వలన దుష్పరిణామాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇటీవలే చైనాలో ఓ బాలిక నిద్రలో కూడా ఫోన్ ఆపరేట్ చేస్తున్నట్లు వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొటì ్టంది. అనేక మంది పిల్లలు మానసిక సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ఫోన్ లేకుండా ఉండలేక ఆత్మహత్యలు చేసుకోవడం కూడా ఇందుకు నిదర్శనమంటున్నారు.
రాజస్థాన్‌లో మరో బాలుడు..
తాజాగా రాజస్థాన్‌లో ఓ బాలుడు అతిగా ఫోన్‌చేసి ఆస్పత్రిలో చేరాడు. అతిగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడడం వలన అర్ధరాత్రులు కేకలు వేయడం, స్క్రీన్ కదుపుతున్నట్లు చేతులు ఆడించడం, శరీరం వణకడం వంటి లక్షణాలు బయటపడ్డాయి. అతిగా పబ్జీ, ఫ్రీఫయర్ ఆడడం వలనే బాలుడు ఇలా తయారయ్యాడని వైద్యులు గుర్తించారు. మానసిక సమస్యతో బాధపడుతున్న బాలుడిని ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఫోన్‌తో అనేక అనర్థాలు..
ఈ మధ్యకాలంలో వచ్చిన అలవాటేమిటంటే ఫోన్‌ను ఆపకుండా వాడుతూనే ఉండడం. పొద్దున్న నిద్ర లేచి లేవగానే ఫోన్ తీస్తున్నాం, రాత్రి నిద్ర కళ్ల మీదకి వాలిపోయే వరకూ ఫోన్‌తోనే ఉంటున్నాం. సోషల్ అప్‌డేట్స్ కోసం కూడా ఫోన్‌పైనే ఆధారపడుతున్నాం. అతిగా ఫోన్ వాడడం ద్వారా అనేక సమస్యలు తలెత్తుతాయని వైద్యులు, మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నా.. పట్టించుకోవడం లేదు. ఫోన్ అతిగా వాడడంతో కలిగే కొన్ని అనార్థాలు..
డెర్మటైటిస్
మీరు మీ చేతుల మీద, మీ ఫేస్ మీద డ్రైగా అయిపోయి, దురద పెడుతున్న ప్యాచెస్‌ని గమనించారా? అది మొబైల్ రేడియేషన్ వల్ల కావొచ్చు. మొబైల్ రేడియేషన్ అప్పటికే కొన్ని ఎలర్జీలతో సఫర్ అవుతున్న వారిలో యాంటిగెన్స్‌ని పెంచుతుంది. దీనికి మరో కారణం ఏంటంటే, ఫోన్‌లో వాడే నికెల్, కోబాల్ట్. ఈ మెటల్స్ రేడియేషన్‌తో కలిసి మీ స్కిన్‌ని ఎర్రగా, దురద ఉండేలా చేస్తాయి.
క్రోస్ ఫీట్
రాత్రి లైట్ తీసేసిన తరువాత కూడా కొంతమంది సెల్ ఫోన్లలో చాట్ చేస్తూ ఉంటారు, లేదా ఏవైనా వీడియోలు చూస్తూ ఉంటారు. సరైన లైటింగ్ లేదు కాబట్టి, చిన్న ఫాంట్ చూస్తారు కాబట్టి స్క్వింట్ చేసి చూడవలసి వస్తుంది. నెమ్మదిగా కళ్ల చుట్టూ ముడతలు వచ్చేస్తాయి.
బ్లూ లైట్
యూవీఏ, యూవీబీ లైట్‌తో పోలిస్తే బ్లూ లైట్ స్కిన్‌కి ఇంకా లోపలికి చొచ్చుకుపోతుంది. సింపుల్‌గా చెప్పాలంటే మూడు గంటలు సెల్‌ఫోన్‌లో మాట్లాడారంటే అర్ధగంట సేపు ఎలాంటి సన్ ప్రొటెక్షన్ లేకుండా ఎండలో గడిపినట్లు. ఇందువల్ల స్కిన్ టోన్‌తో పాటు ఇతర చర్మ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.
మానసిక సమస్యలు..
ఇది పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అతిగా ఫోన్ వాడడం వలన మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. తద్వారా నిద్రలో కూడా అదే కలవరింత కనిపిస్తుంది. ఫోన్ వాడుతున్నట్లుగానే ప్రవర్తిస్తారు. చదువు దెబ్బెతింటుంది. ఆనారోగ్య సమస్యలు పెరుగుతాయి. చూపు దెబ్బతింటుంది.