Discount Offers On Cars: ఆషాఢం మాసం రాగానే పూజలు, వ్రతాలు తగ్గుతాయి. కానీ షాపుల్లో మాత్రం కొనుగోలుదారులతో సందడిగా మారుతుంది. ఈ మాసం సందర్భంగా వస్త్ర దుకాణాలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తాయి. కొన్ని షోరూంలో కేజీల చొప్పున విక్రయిస్తున్నారు. అయితే ఆటోమొబైల్ రంగం కూడా ఆషాఢ మాసాన్ని ప్రత్యేకంగా తీసుకుంటోంది. ముఖ్యంగా కార్ల విక్రయాల్లో భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా కొన్ని కంపెనీలు ఊహించని రీతిలో డిస్కౌంట్లతో పాటు క్యాష్ బ్యాక్ ఇస్తున్నాయి. మరి ఏ కంపెనీ ఇలాంటి ఆఫర్లు ప్రకటించిందో చూద్దామా…
మహీంద్రా థార్ 4X4:
మహీంద్రా కంపెనీ దాదాపు ఎస్ యూవీలనే మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఇందులో భాగంగా ఈ కంపెనీ నుంచి వచ్చిన ‘థార్’ సక్సెస్ అయింది. డీజిల్ ప్యూయల్ తో లీటర్ కు కిలోమీటర్ మైలేజ్ ఇచ్చే ఈ వెహికిల్ 130 బీహెచ్ పీ పవర్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. నలుగురు సౌకర్యవంతంగా కూర్చునే ఈ మోడల్ ను రూ.10.54 లక్షల షో రూం ధరతో విక్రయిస్తున్నారు. ఈ వెహికిల్ పై ఇప్పడు రూ.40,000 డిస్కౌంట్ పొందవచ్చు. రూ.25వేల ఎక్చేంజ్ బోనస్ తో పాటు రూ.10వేల కార్పొరేట్ బెనిఫిట్ తో పాటు మరో రూ.5000 నుంచి క్యాష్ డిస్కౌంట్ ను పొందవచ్చు.
బొలెరో నియో:
మహంద్రా కంపెనీ నుంచి రోడ్లపై తిరుగుతున్న మరో మోడల్ బోలేరో నియో. 1494 సీసీ ఇంజన్ కలిగిన బోలెరో 98.56 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్దుంది. 7గు సౌకర్యవంతంగా కూర్చునే ఈ మోడల్ ను రూ.9.63 లక్షల షో రూం ధరకు విక్రయిస్తున్నారు. ఈ మోడల్ ను కొనుగోలు చేయడం వల్ల రూ.65వేల వరకు ఆదా అవుతుంది. ఇందులో రూ.30,000 క్యాష్ బెనిఫిట్, రూ.10వేలు కార్పొరేట్ బెనిఫిట్, రూ.25వేలు ఎక్ఛేంజ్ బోనస్ ను పొందవచ్చు.
XUV 300:
మహీంద్రా నుంచి మరో ఆకర్షించే మోడల్ XUV 300. 1197 సీసీ ఇంజిన్ తో పాటు 108.62 బీహెచ్ పీ వపర్ నుఉత్పత్తి చేస్తుంది. 5గురు సౌకర్యవంతమైన సీటు సామర్థ్యం ఉన్న ఈ మోడల్ ను రూ.8.41 ఎక్స్ షోరూం ధరకు విక్రయిస్తున్నారు. దీనిని కొనుగోలు చేయడం వల్ల రూ.30,000 వరకు డిస్కౌంట్ పొందుతారు. రూ.25,000 ఎక్చేంజ్ బోన్, రూ.10,000 కార్పొరేట్ బెనిఫిట్స్ న అందిస్తోంది. అయితే టర్బో స్పోర్ట్స్ మోడల్ కొనుగోలు చేస్తే రూ.10 వేల క్యాష్ బ్యాక్ అదనంగా వస్తుంది.
ఇవే కాకుండా మారుతి సుజుకి నుంచి నెక్సా మోడల్స్ అయిన ఇగ్నిస్, సియాజ్, బాలెనో మీద రూ.64,000 వరకు భారీ డిస్కౌంట్ ను పొందవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు.