Ariyana Glory: యంగ్ బ్యూటీ అరియానా తొలిసారిగా తన కెరీర్ ను యూట్యూబ్ లో యాంకర్ గా మొదలు పెట్టి సక్సెస్ అయ్యింది. అనంతరం బిగ్ బాస్ లోకి వెళ్లి ఈ హాట్ బ్యూటీ బాగా పాపులర్ అయిపోయింది. ఇక ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో బిజీగా ఉంది. రెమ్యునరేషన్ కూడా పెంచింది. ఫలితంగా ప్లాట్ వచ్చింది, కారు వచ్చింది. అందుకే, అమ్మడుకు అసలు ఏం అర్ధం కావడం లేదు. ప్రతిదీ ఆనందమయం అయిపోయింది. ఖాళీ సమయం దొరికితే చాలు తన ఫ్రెండ్స్ తో కలిసి బయట తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తుంది.

ఇక రీసెంట్ గా కొనుకున్న తన కొత్త కారులో నిత్యం తెగ షికారులు కొడుతుంది. పైగా ఆ షికారులకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ముందుకు పోతుంది. ఈ క్రమంలో నిన్న అరియనా తన కారును డ్రైవింగ్ చేస్తూ పాటలు పాడుతూ బాగా చిల్ అయ్యింది. ఆ వీడియోని ఫాలోవర్స్ తో పంచుకుంది. అయితే, ప్రస్తుతం ఆ వీడియో పై దారుణమైన కామెంట్లు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఒక నెటిజన్ ఆమెను బాగా ఏకీపారేస్తూ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. ‘నిన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించారు. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం మూగబోయింది. చాలా వరకు అందరు సెలబ్రెటీలు మౌనంగా ఉన్నారు. నువ్వు మాత్రం పండుగ చేసుకుంటున్నావ్ ?, సిగ్గు లేదు ? అని ఒక నెటిజన్ మెసేజ్ పెట్టగా, మరో నెటిజన్.. ప్రభాస్ పెదనాన్న చనిపోతే నువ్వేమో రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నావా ? అంటూ సీరియస్ అయ్యాడు.

ప్రస్తుతం అరియనా పై నెటిజన్లు చేసిన ఈ సీరియస్ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. అసలు ఆరియానా ఫేమస్ కావడానికి కారణం ఆర్జీవీ. ఆర్జీవీ – ఆరియానాల మధ్య జరిగిన బోల్డ్ ఇంటర్వ్యూ కారణంగానే ఆమెకు ఫేమ్ వచ్చింది. ఆరియానాలోని అందాలను ఆర్జీవీ కెమెరా చాలా క్లారిటీగా తెరకెక్కించింది.
ముఖ్యంగా అరియానాకు జిమ్ డ్రెస్ వేసి, ఆమెను రకరకాల భంగిమల్లో పెట్టి కెమరాను కింద నుండి , కాసేపు పై నుండి మొత్తానికి కుర్రాళ్లను ఆకట్టుకోవడానికి ఆర్జీవీ చేయాల్సింది అంతా చేశాడు. దాంతో సాధారణ యాంకర్ ఆరియానా కాస్త, స్టార్ బ్యూటీగా క్రేజ్ తెచ్చుకుంది.