Murali Nayak : దేశవ్యాప్తంగా ఇప్పుడు మురళి నాయక్( Murali Nayak ) నిజమైన హీరో. అమరవీరుడుగా, భరతజాతి ముద్దుబిడ్డగా.. దేశ రక్షణ శ్వాసగా బతికిన మురళి నాయక్ కు సంబంధించి ఆసక్తికర పరిణామాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. సైన్యంలో చేరేందుకు మురళి నాయక్ పడిన తపన, కష్టం సోషల్ మీడియా వేదికగా బయటకు వస్తున్నాయి. చివరికి అనుకున్నది సాధించిన మురళి నాయక్ దేశ రక్షణ కోసం వీరమరణం పొందాడు. సరిహద్దుల్లో పాకిస్తాన్ తో పోరాడుతూ నేల కొరిగాడు. మురళి నాయక్ కు యావత్తు భారతదేశం ఘన నివాళులు అర్పిస్తోంది. తల్లిదండ్రులు, స్నేహితులకు చిన్ననాటి జ్ఞాపకాలు కళ్ళల్లో మెదులుతుండగా.. ఈ వీరుడి భౌతిక కాయం చూసి యావత్ భారతావని తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
Also Read :మద్యం కుంభకోణంలో అప్రూవర్ గా కీలక నిందితుడు?
* సైన్యంలో చేరాలని బలమైన నిర్ణయం..
సైన్యంలో చేరాలని చిన్ననాటి నుంచి బలమైన నిర్ణయం తీసుకున్నాడు మురళి నాయక్. అందుకు లక్ష్యంగా పెట్టుకున్నాడు. బాగా కష్టపడ్డాడు. 2022 డిసెంబర్లో గుంటూరులో( Guntur) జరిగిన ఎంపిక ప్రక్రియలో అగ్ని వీర్ గా ఎంపికయ్యాడు. ముందుగా పంజాబ్లో పని చేసాడు. అనంతరం అస్సాంలో విధులు నిర్వహించాడు. రెండున్నర ఏళ్ల సర్వీస్ పూర్తి కావడంతో మరో ఏడాదిన్నర కాలంలో అగ్రిమెంట్ పూర్తి చేసుకుని వస్తాడని అంతా భావించారు. కొద్దిరోజులుగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో సేవలు అందిస్తూ.. అనుకోని రీతిలో అమరుడయ్యాడు. మురళికి ప్రాథమిక స్థాయి నుంచి దేశభక్తి ఎక్కువ. అందుకే రైల్వేలో వచ్చిన ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు. తనకు ఇష్టమైన ఆర్మీలో చేరాడు. ఒక్కగానొక్క కుమారుడిని ఘనంగా పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు. ఇంతలోనే విషాదం అలుముకుంది.
* ఎంతో కష్టపడ్డా..
మురళి నాయక్ ఆర్మీలో( Indian Army) చేరడానికి ఎంత కష్టపడ్డాడు ఆయన సోషల్ మీడియా అకౌంట్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. మురళి నాయక్ సోషల్ మీడియా పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆర్మీలో చేరేందుకు మురళి పడిన కష్టం చూసిన నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. ప్రతి వీడియోలో ఆర్మీ గురించి గొప్పగా వివరిస్తూ పోస్ట్ చేశాడు మురళి. ఆర్మీలో చేరడం కోసం ప్రతిరోజు చేసిన ప్రాక్టీస్ వీడియోలను సైతం పోస్ట్ చేశాడు. ప్రస్తుతం మురళి నాయక్ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలుస్తున్నాయి.
* పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని..
మురళి నాయక్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు( AP deputy CM Pawan Kalyan) వీరాభిమాని. పవన్ కళ్యాణ్ వీడియోని మురళి నాయక్ తొలి ఇన్ స్టా పోస్ట్ కావడం విశేషం. జనసేన పార్టీ కార్యక్రమాలకు వెళ్ళిన ఫోటోలు.. పవన్ కళ్యాణ్ పాటకు డాన్స్ చేసిన పాత వీడియో కూడా వైరల్ అవుతుంది. భారత సైన్యంలో చేరడమే జీవిత ఆశయంగా భావించిన మురళి నాయక్.. దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరుడయ్యాడు. నేను జాతీయ జెండా కప్పుకొని చనిపోతానని మురళి నాయక్ చెబుతుండేవాడని ఆయన స్నేహితుల సైతం చెప్పుకొస్తున్నారు. మురళి నాయక్ మాటలు తలుచుకుని స్నేహితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. చెప్పినట్లుగానే జాతీయ జెండా కప్పుకుని చనిపోయాడు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
Nara Lokesh garu paid his respects to fallen hero Murali Naik garu. AP & India mourn the loss of their brave son. We will never forget his sacrifice. మురళీ నాయక్ అమర్ రహే.#JaiHind #SaluteToMartyr #MuraliNaik #OperationSindoor @naralokesh @JaiTDP @FlagsOfHonour… pic.twitter.com/dcI0kxBpK0
— S. Rajiv Krishna (@RajivKrishnaS) May 12, 2025