Homeటాప్ స్టోరీస్Revanth Reddy Musi River Project Plan: మూసీ ‘మురిపాలు’.. రాజకీయ ‘ముచ్చట్లు’

Revanth Reddy Musi River Project Plan: మూసీ ‘మురిపాలు’.. రాజకీయ ‘ముచ్చట్లు’

Revanth Reddy Musi River Project Plan: హైదరాబాద్ నగరంలో మూసీ నదికి ఒక విచిత్రమైన చరిత్ర ఉంది. అదెలాగంటే.. ప్రతి ఎన్నికలకు ముందు మూసీ నది ‘లండన్ థేమ్స్’లా మారిపోతుంది.. ఎన్నికలు అయిపోయాక మళ్ళీ యధావిధిగా ‘మురికి కూపం’గా ప్రమోషన్ పొందుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వంతు వచ్చింది. బాపూఘాట్ దగ్గర ఏకంగా గాంధీజీ విగ్రహాన్ని పెట్టేసి, మూసీని ‘గాంధీ సరోవరం’గా మార్చేయాలని ప్లాన్ చేశారు. వింటేనే భలే ఉంది కదూ! Also Read: […]

Revanth Reddy Musi River Project Plan: హైదరాబాద్ నగరంలో మూసీ నదికి ఒక విచిత్రమైన చరిత్ర ఉంది. అదెలాగంటే.. ప్రతి ఎన్నికలకు ముందు మూసీ నది ‘లండన్ థేమ్స్’లా మారిపోతుంది.. ఎన్నికలు అయిపోయాక మళ్ళీ యధావిధిగా ‘మురికి కూపం’గా ప్రమోషన్ పొందుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వంతు వచ్చింది. బాపూఘాట్ దగ్గర ఏకంగా గాంధీజీ విగ్రహాన్ని పెట్టేసి, మూసీని ‘గాంధీ సరోవరం’గా మార్చేయాలని ప్లాన్ చేశారు. వింటేనే భలే ఉంది కదూ!

Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ట్రైలర్ రివ్యూ : పవన్ కళ్యాణ్ లో ఇంత కామెడీ టైమింగ్ చూసి ఎన్ని రోజులైందో!

కానీ అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది. నదిని బాగు చేద్దామని రేవంత్ పీపీటీ ప్రెజెంటేషన్లు ఇస్తుంటే అవతలి వైపు విపక్షాలు ‘సర్జికల్ స్ట్రైక్’ అంటూ కత్తులు నూరుతున్నాయి.

ప్రభుత్వ ‘సైలెంట్’ స్ట్రాటజీ.. విపక్షాల ‘నాయిసీ’ స్ట్రాటజీ!

ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో ఏడీబీ బ్యాంకు నుంచి అప్పు తెచ్చి, మూసీని సుందరీకరిస్తామని చెబుతుంటే.. విపక్షాలేమో “మా ఇల్లు కూల్చేస్తారా?” అంటూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిజానికి ఈ విల్లాలు, అపార్ట్‌మెంట్లు కట్టినప్పుడు ఆ గూగుల్ మ్యాప్స్ అప్పట్లో ఎక్కడికి వెళ్లాయో ఎవరికీ అర్థం కావడం లేదు.

చరిత్ర పునరావృతం.. బాబు, వైఎస్, కేసీఆర్.. అందరూ మాష్టర్లే!

మూసీ ప్రక్షాళన అనేది పాతకాలపు సీరియల్ లాంటిది. చంద్రబాబు సమయంలో “నందనవనం” పేరుతో కాలువ కడితే.. అది వర్షానికి ‘నీట’ మునిగింది. వైఎస్ఆర్ హయాంలో “సేవ్ మూసీ” అంటూ రబ్బరు డ్యామ్ కడితే.. అది వరదకు కొట్టుకుపోయింది. కేసీఆర్ పాలనలో “రివర్ ఫ్రంట్” అని కార్పొరేషన్ పెట్టారు.. అది చివరికి రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. ఇప్పుడు రేవంత్ గారు “గాంధీ సరోవరం” అంటున్నారు. చరిత్ర పాఠాలు చదివితే.. “మూసీ ప్రక్షాళన” అంటేనే ఒక పెద్ద ‘ప్రాజెక్టు అటకెక్కింపు’ కార్యక్రమం అని అర్థమవుతోంది.

నిర్వాసితుల గోల – నేతల జోల

అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంటే, పేదవాడి కన్నీరు.. అదే పెద్ద పెద్ద విల్లాల దగ్గర కొచ్చేసరికి ‘సర్దుబాటు’ రాజకీయాలు.. ఇదే కదా మన హైదరాబాద్ స్పెషాలిటీ! సర్కార్ ఏమో లండన్ కలను చూపిస్తుంటే.. నిర్వాసితులు మాత్రం ‘మా గూడు మాకుండనివ్వండి’ అని ప్రాధేయపడుతున్నారు.

చివరికి మూసీ మారుతుందో లేదో తెలియదు కానీ, రాజకీయ పార్టీలకు మాత్రం మూసీ ఒక ‘శాశ్వత ఆదాయ వనరు’గా ‘నిరంతర విమర్శనాస్త్రం’గా మారిపోయింది. మొత్తానికి మూసీకి శుద్ధి ఎప్పుడు జరుగుతుందో కానీ, రాజకీయ నాయకులకు మాత్రం ఈ ఇష్యూతో ఎప్పుడూ ‘పబ్లిసిటీ’ పుష్కలంగా దొరుకుతోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper