spot_img
Homeఎంటర్టైన్మెంట్Manchu Family: ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, మనోజ్ ఛీప్ కామెంట్స్!

Manchu Family: ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో మంచు ఫ్యామిలీ… మోహన్ బాబు, మనోజ్ ఛీప్ కామెంట్స్!

Manchu Family
Manchu Family

Manchu Family: మంచు ఫ్యామిలీ ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉంది. అంతర్గత కుమ్ములాటలు, ఫెయిల్యూర్స్, మీడియా ఒత్తిడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొత్తంగా ఏం మాట్లాడాలో ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి. ఆ ఫ్రస్ట్రేషన్ తోనే మంచు మనోజ్ కుటుంబ పరువు రోడ్డుకు లాగాడు. అన్నదమ్ముల గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెట్టాడు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ట్రై చేసి విష్ణు అబాసుపాలయ్యారు. విష్ణు హౌస్ ఆఫ్ మంచూస్ రియాలిటీ షో డ్రామా రక్తి కట్టలేదు. పైగా ఇంకా అనుమానాలు బలపరిచింది. కాలు బయట పెట్టాలంటే మీడియాకు ఏం సమాధానం చెప్పాలనే ఓ అసహనం వెంటాడుతుంది.

దాని తాలూకు ఆనవాళ్లు మోహన్ బాబు, మనోజ్ మాటల్లో స్పష్టంగా కనిపించాయి. తిరుపతిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ ఈవెంట్లో మోహన్ బాబు, మనోజ్, మౌనిక పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మీ కుటుంబంలో కలహాలు ఉన్నాయన్న ప్రచారం మీద స్పందించాలని ఓ విలేకరి మోహన్ బాబును అడిగారు. దానికి మోహన్ బాబు చేసిన కామెంట్ కొంచెం కఠినంగా ఉంది. ‘మీ ఇంట్లో మీ భార్యతో నీకున్న సంబంధం ఏమిటో చెబుతావా?. సందర్భాన్ని బట్టి ప్రశ్నలు అడగండి. మీరు చదువుకున్నవారు… అని ఆవేశపడ్డారు.

Manchu Family
Manchu Family

ఆయన స్పందించిన తీరు హుందాగా లేదని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ దాని గురించి మాట్లాడటం ఇష్టం లేకపోతే… నో కామెంట్స్ అని ఒక్క పదం చెబితే సరిపోతుంది… భార్యలు బంధాల వరకు వెళ్లాల్సిన అవసరం ఏముంది చెప్పండి. తండ్రి మోహన్ బాబుకు మించిన అతి సమాధానం మనోజ్ చెప్పాడు. అన్నయ్య విష్ణుతో మీకు ప్రాబ్లమ్ ఏంటని అడగ్గా… ఈ మధ్య నాకు సెగ్గడ్డ వచ్చింది. వచ్చి గోకుతారా? అదే నా ప్రాబ్లమ్ అని… మరీ ఛీప్ కామెంట్స్ చేశారు.

మంచు ఫ్యామిలీ వెనుకబడి పోవడానికి ఈ అతే కారణం. జనాల్లో ఈ ఫ్యామిలీ మీద ఒక రకమైన నెగిటివిటీ పెరిగిపోయింది. పబ్లిక్ లో నోటికి వచ్చింది మాట్లాడటం. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో ఘనులు. నేల మీద పడ్డా కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఇంకెప్పుడు తీరు మార్చుకుంటారని టాలీవుడ్ వర్గాలు వాపోతున్నాయి. విషయం ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతా అనే మోహన్ బాబుకు, కొడుకుల గొడవల విషయంలో డొంకతిరుగుడు వ్యవహారం ఎందుకు? నేరుగా చెప్పేస్తే పోలా…

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Sidiri Appalaraju Arrest

Sidiri Appalaraju Arrest: అరెస్టు చేసే దాకా తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి!

Sidiri Appalaraju Arrest: ఎట్టకేలకు మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి...
Healthy Dinner

Healthy Dinner: రాత్రి సమయంలో ఈ ఆహారం తింటున్నారా…

Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం...
RRB JE Recruitment 2026

RRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ)...
Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Oktelugu Epaper