Tammareddy Bharadwaj : విలక్షణ నటుడు, నిర్మాత మోహన్ బాబు పరిశ్రమ పెద్దల్లో ఒకరిగా ఉన్నారు. అంతర్గత కలహాలతో ఆయన కీర్తి మసకబారుతుంది. కొన్నేళ్లుగా నాలుగు గోడల మధ్య ఉన్న గొడవలు రోడ్డుకు ఎక్కాయి. మోహన్ బాబు, విష్ణు ఒక వర్గంగా మనోజ్ మరొక వర్గంగా చేరి కుమ్ములాటలకు దిగారు. మోహన్ బాబు మనుషులు తనపై దాడి చేశారని మనోజ్ కేసు పెట్టాడు. మనోజ్, అతని భార్య మౌనిక నుండి తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు ఇంకో కేసు పెట్టారు. జుల్పల్లి ఫార్మ్ హౌస్ వేదికగా యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. మోహన్ బాబు తుపాకీతో హల్చల్ చేశాడు. పోలీస్ అధికారులు పిలిచి ఇరు వర్గాలకు వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
గొడవలు ఇంకా సద్దుమణగలేదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా మాటల దాడికి పాల్పడుతున్నారు. మోహన్ బాబు కుటుంబంలో ఏర్పడిన ఈ సంక్షోభం కొందరు ఇండస్ట్రీ ప్రముఖులను బాధిస్తుంది. సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందించారు. మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్న కలహాలు బాధిస్తున్నాయి. ఆ కుటుంబం ఎప్పటిలా కలిసిపోవాలని కోరుకుంటున్నాను. వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు మధ్యవర్తిత్వం చేయడానికి కూడా సిద్ధం అని ఆయన అన్నారు. మరి తమ్మారెడ్డి ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.
Also Read : ఎన్టీఆర్ ఖాతాలో మరో మైలురాయి వచ్చి చేరిందా..?
ఇక దాదాపు పదేళ్ల గ్యాప్ అనంతరం మంచు మనోజ్ భైరవం మూవీతో కమ్ బ్యాక్ ఇస్తున్నాడు. అయితే దర్శకుడు విజయ్ కనకమేడల కారణంగా భైరవం మూవీ వ్యతిరేకతకు గురవుతుంది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుకలో ఆయన చేసిన కామెంట్స్ వైసీపీ కార్యకర్తలను ఆగ్రహానికి గురి చేశాయి. సినిమా వేదికల మీద రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నారంటూ వారు మండిపడుతున్నారు. బాయ్ కాట్ భైరవం అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. వీరికి మెగా ఫ్యాన్స్ తోడయ్యారు. 2011లో చిరంజీవి, రామ్ చరణ్ లను కించపరుస్తూ విజయ్ కనకమేడల ఓ మార్ఫింగ్ పోస్టర్, తన ఫేస్ బుక్ ఖాతాలో పెట్టాడనే ఆరోపణ వినిపిస్తుంది. సదరు మార్ఫింగ్ పోస్టర్ తెరపైకి వచ్చింది.
ఈ పోస్టర్ చూసిన మెగా ఫ్యాన్స్ విజయ్ కనకమేడల మీద ఫైర్ అవుతున్నారు. వారు తీవ్రంగా ప్రతిఘటించిన నేపథ్యంలో విజయ్ కనకమేడల వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. నేను మెగా ఫ్యాన్స్ లో ఒకడిని. ఆ పోస్ట్ నేను పెట్టలేదు. నా అకౌంట్ హ్యాక్ అయ్యిందంటు, ఒక నోట్ విడుదల చేశాడు. 2011 నాటికి నువ్వు ఎవరో కూడా తెలియదు. నీ అకౌంట్ హ్యాక్ కావడం ఏమిటంటూ మెగా ఫ్యాన్స్ ఎదురు ప్రశ్నిస్తున్నారు. వారు సంతృప్తి చెందిన దాఖలాలు లేవు. భైరవం ప్రీ రిలీజ్ వేడుకలో మంచు మనోజ్ మెగా ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పాడు.