Knowledge Hut: సాఫ్ట్ వేర్ జాబ్ అంటే ఒకప్పుడు భూతల స్వర్గంలా భావించేవారు. కానీ రాను రాను ఈ రంగంలో పనిచేయలేక చాలా మంది ఇతర పనుల్లోకి వెళ్తున్నారు. కొన్నాళ్లపాటు సాఫ్ట్ ఫేర్ భూం కొనసాగిన తరువాత ఒక్కసారిగా పడిపోయింది. ఇప్పుడు చాలా మంది సాఫ్ట్ వేర్ జాబ్ అంటే భయపడుతున్నారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్య పరిస్థితులతో ఈ రంగంలో పనిచేస్తున్న వారు తమ జాబ్ ఎప్పుడు ఊడుతుంతో తెలియని పరిస్థితి నెలకొందని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో ఓ తెలుగు వ్యక్తి సాఫ్ట్ వేర్ కంపెనీని స్ట్రాట్ చేసి విదేశాల్లోని బిగ్ కంపెనీల మధ్యకు చేర్చాడు. పైకి చూస్తే చాలా సింపుల్ గా కనిపించే ఈ వ్యక్తి గురించి తెలిసి చాలా మంది ఇంప్రెస్ అవుతున్నారు. అంతేకాకుండా ఆయనను ఆదర్శంగా తీసుకుంటున్నారు.
నాలెడ్జ్ హట్… బెంగుళూరుకు చెందిన ఈ కంపెనీని సుబ్రహ్మణ్యరెడ్డిన స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు, వ్యక్తుల నైపుణ్యాలను తీర్చిదిద్దడంలో సహాయపడే గ్లోబ్ ఎడ్ టెక్ కంపెనీ ఇది. చాలా కంపెనీలో తమ సంస్థల్లో నిపుణులైన ఉద్యోగులు ఉండాలనుకుంటారు. అలాంటి వారి కోసంక నాలెడ్జ్ హట్ లో యువకులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. గత పదేళ్ల కాలంలో 2,50,000 మందికి శిక్షణ ఇచ్చినట్లు ఫైండర్ సుబ్బు తెలుపుతున్నారు.
ప్రస్తుతం 70 దేశాల్లో ఫార్చ్యూన్ 500 కంపెనీలకు సపోర్టుగా ఉంటున్నారు. అత్యాధునిక ఇమ్మర్సివ్ లెర్నింగ్, ఎక్స్ పీరియన్స్ ప్లాట్ ఫాంను ఉపయోగించడం ఈ కంపెనీ ప్రత్యేకత ఇక్కడి సర్టిఫికెట్ కు గ్లోబల్ లెవల్లో గుర్తింపు ఉంది. అందుకే ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవాలని చాలా మంది ఆరాటపడుతూ ఉంటారు.
ఇక ఈ కంపెనీని స్థాపించడానికి సుబ్రహ్మణ్య రెడ్డి రూ.3 లక్షలు ఖర్చు చేశారు. ఇప్పుడు ఆయన టర్నోవర్ రూ.300 కోట్లకు చేరింది. దేశ విదేశాల్లోనాలెడ్జ్ హట్ సంస్థ నుంచి వెళ్లిన వారికి మంచి మంచి హోదాల్లో పనిచేస్తున్నారు. అయితే కంపెనీ వ్యవస్థాపకుడు సుబ్బు చాలా సింపుల్ గా ఉంటారు. ఆడంబరాలు, హైఫైగా ఉండడం ఆయనకు నచ్చదు. ప్రతీ వ్యక్తి తన జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి తాము ఎంతో సహకరిస్తామని ఆయన చెబతూ ఉంటారు. ఇంకా ఆయన తన పర్సనల్ విశేషాలను వీడియో ద్వారా వివరించాడు.మరి ఆ వీడియోను మీరు కూడా చూసేయండి..